-జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత
-అన్ని ఏర్పాట్లూ పూర్తి
-సమన్వయంతో పనిచేస్తున్న కడప టీడీపీ క్యాడర్
– ప్రాంతాల వారీగా భోజన వసతులు
-మహానాడు కమిటీల నియామకం
-టార్గెట్ కంటే అధికంగా రాయలసీమ నుంచి జన సమీకరణ
-5 లక్షల మంది వచ్చే అవకాశం : ఇన్చార్జి మంత్రి సవిత
కడప, నేటి పత్రిక ప్రజావార్త :
చరిత్రలో నిలిచిపోయేలా మహానాడును నిర్వహిస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే క్యాడర్, నాయకుల కోసం అన్ని వసతులూ సిద్ధం చేశామన్నారు. ఈ నెల 27, 28, 28 తేదీల్లో కడపలోని పబ్బావరంలో నిర్వహించే టీడీపీ మహానాడు ఏర్పాట్లపై ఆదివారం నిర్వహించిన సన్నాహాక సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత మాట్లాడారు. జిల్లా ఇన్చార్జి మంత్రిగా తన ఆధ్వర్యంలో టీడీపీ మహానాడు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. గతంలో నిర్వహించిన మహానాడు కంటే చరిత్రలో నిలిచిపోయేలా కడప మహానాడును నిర్వహించడానికి కడప నాయకులు, కార్యకర్తల సమన్వయంతో, ఐక్యమంతో పనిచేస్తున్నారన్నారు. మూడో రోజుల పాటు నిర్వహించే మహానాడు కోసం అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేశామన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుకుండా రాకపోకలకు వీలుగా రూట్ మ్యాప్ రెడీ చేశామన్నారు. వసతుల వారీగా కమిటీలు నియమించామన్నారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు చెందిన నాయకులకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తమ ప్రాంతంలో, బీటెక్ రెడ్డి ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి అనంతపురం, సత్యసాయి జిల్లా టీడీపీ క్యాడర్ కు పులివెందులలో భోజన సదుపాయలు ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో మిగిలిన ప్రాంత నాయకులకు కూడా మూడ్రోజుల పాటు అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నామన్నారు. ఇలా ఎక్కడికెక్కడ ఎటువంటి ఇబ్బందులు, అంతరాయాలు కలుగుకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. రాయలసీమ నాయకులు తమకు ఇచ్చిన టార్గెట్ మేరకంటే అదనంగా జన సమీకరణ చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన ప్రాంత నాయకులు తమ టార్గెట్ మేర జనసమీకరణ చేపట్టాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత కోరారు. అంతకుముందు పబ్బావరంలో మహానాడు నిర్వహించే ప్రాంతాన్ని మంత్రులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులతో కలిసి మంత్రి సవిత పరిశీలించారు. ఈ సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
5 లక్షల మంది వచ్చే అవకాశం
44వ టీడీపీ మహానాడుకు అయిదు లక్షల మంది క్యాడర్ వచ్చే అవకాశముందని జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత తెలిపారు. తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ, రాయలసీమ నుంచి మూడు లక్షల వరకూ జన సమీకరణ చేపడుతున్నట్లు తెలిపారు. కడపలో మహానాడు నిర్వహణకు నిర్ణయించిన సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు. మహానాడు విజయవంతానికి 13 కమిటీలు నియమించామన్నారు. టీడీపీతోనే రాయలసీమ అభివృద్ధి సాధ్యమవుతుందని, ఇదే విషయం చరిత్ర చూస్తే తెలుస్తుందని మంత్రి తెలిపారు. మహానాడు వేదికగా రాయలసీమ అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు మరిన్ని వరాలు కురిపించే అవకాశముందని మంత్రి సవిత వెల్లడించారు.
Prajavartha Online Telugu News