Breaking News

ప్రజా సమస్యల పరిష్కారం చేసేందుకు అధికారులతో పర్యటన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ గులాబీ తోట ప్రాంతాన్ని ఆదివారం తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు ప్రజా సమస్యలు తెలుసుకుని రక్షణ యుద్ధ ప్రాతిపదికన మీద ప్రజా సమస్యల పరిష్కారం చేసేందుకు అధికారులతో కలిసి తెలుగుదేశం పార్టీ డివిజన్ నాయకులు పాదయాత్రగా పర్యటించడం జరిగింది.

ఈ సందర్భంగా డివిజన్ ఇంచార్జ్ నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న ఈ నెలల కాలంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు ఇప్పటికే ₹180 కోట్ల రూపాయలకు పైగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని… మరొక 90 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పి ప్రజలకు వివరాలు తెలియజేస్తూ, ప్రధానంగా 27వ డివిజన్ మీద ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు పరిష్కారం చేయడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని దానిలో భాగంగా ఈనాడు ఈ గులాబీ తోట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాసమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని అధికారులను, తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రజలను కలిసి యుద్ద ప్రాతిపదికన పరిష్కరించాలని బోండా ఉమా చర్యలు తీసుకుని అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని… ప్రధానంగా అన్నా క్యాంటీన్ వద్ద నుండి చివర తూర్పు కాపు కళ్యాణ మండపం వరకు రోడ్డుకు కుడి చేతి వైపు ఫ్లోర్ బ్లాక్ టైల్స్ ను ఏర్పాటు చేయాలని, పార్కు వద్ద నుండి ఎండింగ్ చర్చి వరకు ఉన్నటువంటి రోడ్డు ట్రాక్ మరమ్మతు పనులు చేయాలని చెప్పి, అదేవిధంగా కాలవకు ఉన్నటువంటి గుంతలు పోట్చాలని అక్కడ ఉన్నటువంటి సివిల్ వర్క్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని, నూతన వాటర్ పైప్ నూతన వాటర్ పైప్ లైన్ ఏర్పాటు, అమృత సంస్థ వారు ఆ ప్రాంతాన్ని చదును చేసి మట్టిని తొలగించవలసినటువంటి అవసరం ఉన్నది అని, ట్రాఫిక్ పోలీసుల ద్వారా నిరుపయోగంగా టు వీలర్, ఫోర్ వీలర్ వాహనాలు పార్కింగ్ ను అక్కడ నుండి తొలగించవలసినటువంటి అవసరం ఉన్నది అని, వీటితోపాటు శానిటేషన్ కు సంబంధించినటువంటి పనులు కూడా వేగవంతం చేయాలని నాయకులు తెలియజేయగా, తక్షణమే బోండా ఉమా గారు పర్యటనలో ఉన్నటువంటి CIVIL AE రామకృష్ణ కి ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసి తక్షణమే ఈ పనులు యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలని చెప్పి తెలియజేశారు.

అమృత సంస్థ AE అయినటువంటి నాగేశ్వరరావు, క్రాంతి లకు కూడా ఆ ప్రాంతంలో గుంతలుగా ఉన్నటువంటి మట్టిని వెంటనే తొలగించి చదును చేయాలని చెప్పి ఆదేశించారు, అలాగే టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించినటువంటి నాగేంద్ర కి ఆ ప్రాంతంలో ఇల్లు నిర్మాణ దశలో ఉన్నటువంటి వారు రోడ్లు మీద మట్టి వేయకుండా ఆ మట్టిని మొత్తం తొలగించాలని వారికి ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమస్యలన్నిటిని తక్షణమే పరిష్కరించి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు, ఇటువంటి ప్రజల కోసం నిరంతరం ఆలోచించేటువంటి ఎమ్మెల్యే ఉండటం మనం చేసుకున్నటువంటి అదృష్టమని ఎన్నికల సమయంలో ఓట్లు వేయించుకొవడమే కాదు తర్వాత కూడా ప్రజాసమస్యలు తెలుసుకోని ఆ సమస్యల పరిష్కారం దిశగా వేగంగా పనిచేయడం చాలా గొప్ప విషయమని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ చూపినటువంటి మార్గంలో ముందుకు సాగుతూ ప్రజల వందనాలు పొందుతున్నటువంటి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు గారికి ధన్యవాదాలు తెలియజేశారు.

దీనిలో 199, 200 కు సంబంధించినటువంటి సచివాలయ సిబ్బంది కూడా పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు దాసరి జయరాజు, ప్రధాన కార్యదర్శి మల్లంపల్లి సురేష్, బత్తుల శివ, కొండపల్లి రూప్ కుమార్, డి మార్ట్ రవణమ్మ, మద్దాల రుక్మిణి, బేవర వెంకటరావు, బండారు కొండ, దేసు వెంకటరావు, శ్రీనివాస్, మహేష్, K మల్లి, వెంకటేశ్వరరావు, శివ బాబు, గులాబీ తోట వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నారాయణ రావు, మాల్యాద్రి లతోపాటు కమిటీ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *