Breaking News

పాత్రికేయులు యోగాను జీవ‌న‌మార్గంగా ఎంచుకోవాలి

– ప్ర‌జ‌ల‌కు యోగా ఔన్న‌త్యాన్ని చాటిచెప్పాలి
– జ‌ర్న‌లిస్టుల థీమ్ యోగాకు విశేష స్పంద‌న‌
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినూత్న క‌థ‌నాలు, సంచ‌ల‌న వార్త‌లతో ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతుల‌ను చేసేందుకు పాత్రికేయుల‌కు నిత్యనూత‌న ఆలోచ‌నా శ‌క్తిని అందించే యోగాను జీవ‌న‌మార్గంగా పాత్రికేయులు ఎంచుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. ల‌క్ష్మీశ సూచించారు.
యోగాంధ్ర మాసోత్స‌వాల్లో భాగంగా శ‌నివారం విజ‌య‌వాడ బీఆర్‌టీఎస్ రోడ్డు శార‌దా క‌ళాశాల వ‌ద్ద క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ థీమ్ ఆధారిత యోగాభ్య‌స‌న కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. మాసోత్స‌వాల నాలుగోరోజు, థీమ్ యోగా మొదటి రోజున క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ జ‌ర్న‌లిస్టుల‌తో క‌లిసి యోగాసనాలు అభ్య‌సించారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మీడియాతో మాట్లాడుతూ జ‌ర్న‌లిస్టులు త‌మ రోజువారీ వృత్తిగ‌త జీవితంలో అనేక స‌వాళ్లను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని, డెడ్‌లైన్ల ఒత్తిడి వాతావ‌ర‌ణంలో ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని ఈ నేప‌థ్యంలో శారీరక, మానసిక దృఢత్వాన్ని అందించే పాత్రికేయులు త‌మ జీవితంలో యోగాను భాగం చేసుకోవాల‌న్నారు. క‌నీసం రెండుకోట్ల మందికి యోగాను నేర్పే ల‌క్ష్యంతో రాష్ట్ర ప్ర‌భుత్వం యోగాంధ్ర మాసోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తోంద‌ని. ఇదేవిధంగా జిల్లాలో దాదాపు 10 ల‌క్ష‌ల నుంచి 15 ల‌క్ష‌ల మందికి యోగాను నేర్పేందుకు వీలుగా ఈ నెల 24, 25వ తేదీల్లో మాస్ట‌ర్ ట్రైన‌ర్ల‌కు శిక్షణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. థీమ్ ఆధారిత యోగా కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు గొంతుగా.. ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి మ‌ధ్య వార‌ధిగా ఉండే ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియా జ‌ర్న‌లిస్టుల‌తో ప్రారంభించామ‌ని.. మే 25న జేఏసీ నేత‌లు, ప్ర‌భుత్వ ఉద్యోగులు, మే 26న పోలీస్‌-హోంగార్డ్స్‌, మే 27న వాక‌ర్స్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు ఇలా అన్ని వ‌ర్గాల ప్ర‌జాభాగ‌స్వామ్యంతో జూన్ 20 వ‌ర‌కు నిర్వ‌హిస్తామ‌న్నారు. జూన్ 21న అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌ర‌గ‌నున్నాయ‌ని వివ‌రించారు.

మ‌న ఘ‌న వార‌స‌త్వ సంప‌ద యోగా:
యోగా భార‌తీయ ఘ‌న వార‌స‌త్వ సంప‌ద అని.. నేడు యోగాను 70కు పైగా దేశాల్లో ఆచ‌రిస్తున్నార‌ని, ఇంత‌టి విశిష్ట‌త క‌లిగిన యోగాపై ప్ర‌తిఒక్క‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించి, యోగాలో ప్ర‌వేశించి ఆరోగ్య‌క‌ర‌మైన జీవితాన్ని సొంతం చేసుకునేలా మీడియా ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతుల‌ను చేయాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. యోగాంధ్ర మాసోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకొని గ్రామ‌, మండ‌ల‌, జిల్లాస్థాయిలో వ్య‌క్తిగ‌త‌, గ్రూపు కేట‌గిరీల్లో ఆస‌నాల ప్ర‌ద‌ర్శ‌న, సూర్య న‌మ‌స్కార్ ఛాలెంజ్‌, ప్రాణాయామం, యోగా పెయింటింగ్‌, యోగా షార్ట్ ఫిల్మ్‌, యోగా ఫొటోగ్ర‌ఫీ వంటి అంశాల్లో పోటీలు నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని, వీటిలో ప్ర‌జ‌లు పెద్దఎత్తున పాల్గొని యోగాంధ్ర‌ను విజ‌య‌వంతం చేయాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ కోరారు.
కార్య‌క్ర‌మంలో విజ‌య‌వాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య‌, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ అద‌న‌పు క‌మిష‌న‌ర్ డి.చంద్ర‌శేఖ‌ర్‌, జిల్లా యోగాంధ్ర నోడ‌ల్ అధికారులు డా. ఎం.సుహాసిని, డా. జె.సుమ‌న్‌, జిల్లా ఆయుష్ అధికారి డా. రామత్లేహి, యోగా ట్రైన‌ర్ ఎ.స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *