Breaking News

కృత్రిమ అవ‌యవాల‌తో విభిన్న ప్ర‌తిభావంతుల్లో మాన‌సిక ధైర్యం

– ఎన్‌టీఆర్ ట్ర‌స్టు, సుధీక్ష‌ణ్ ఫౌండేష‌న్ సేవ‌లు ప్ర‌శంస‌నీయం
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్ర‌మాదాల్లో కాళ్లు, చేతులు కోల్పోయిన వారికి, విభిన్న ప్ర‌తిభావంతుల‌కు కృత్రిమ అవ‌యవాలు అమ‌ర్చ‌డం ద్వారా వారిలో మాన‌సిక ధైర్యం ల‌భిస్తుంద‌ని.. ఆత్మ‌విశ్వాసంతో ముంద‌డుగు వేసే శ‌క్తి చేకూరుతుంద‌ని.. ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు చేయ‌డం, కృత్రిమ అవ‌యావాలు పంపిణీ చేయ‌డం వంటి గొప్ప కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న ఎన్‌టీఆర్ ట్ర‌స్టు, సుధీక్ష‌ణ్ ఫౌండేష‌న్ సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. శుక్ర‌వారం విజ‌య‌వాడలోని బ‌స‌వ‌పున్న‌య్య భ‌వ‌న్‌లో ఎన్‌టీఆర్ మెమోరియ‌ల్ ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో డా. బండ్ల‌మూడి బ‌స‌వేశ్వ‌రరావు స‌మ‌క్షంలో ఉచిత దంత వైద్య శిబిరం జ‌రిగింది. కార్య‌క్ర‌మంలో 300 మందికి ఉచితంగా దంత వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి మందులు అంద‌జేశారు. అదేవిధంగా ఎన్‌టీఆర్ ట్ర‌స్టు, సుధీక్ష‌ణ్ ఫౌండేష‌న్ సంయుక్త ఆధ్వ‌ర్యంలో 150 మందికి కృత్రిమ చేతులు, కాళ్లు పంపిణీ చేయ‌డం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ జి.ల‌క్ష్మీశ ముఖ్యఅతిథిగా పాల్గొని ల‌బ్ధిదారుల‌తో మాట్లాడి, మందులు పంపిణీ చేశారు. పేద‌లకు భ‌రోసా క‌ల్పించేలా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించిన నిర్వాహ‌కుల‌ను క‌లెక్ట‌ర్ అభినందించారు. భ‌విష్య‌త్తులోనూ ఎన్‌టీఆర్ ట్ర‌స్టు ద్వారా మ‌రిన్ని ప్ర‌జాప్ర‌యోజ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని డా. బ‌స‌వేశ్వ‌రరావు తెలిపారు. కార్య‌క్ర‌మంలో సుధీక్ష‌ణ్ ఫౌండేష‌న్ ప్ర‌తినిధి చిగురుపాటి విమ‌ల త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *