Breaking News

150 మంది మాస్ట‌ర్ ట్రైన‌ర్ల‌కు శిక్ష‌ణ కార్య‌క్ర‌మం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మే 21 నుంచి జూన్ 21 వ‌ర‌కు జ‌రిగే యోగాంధ్ర మాసోత్స‌వాల్లో జిల్లాలో దాదాపు 10 ల‌క్ష‌ల నుంచి 15 ల‌క్ష‌ల మందికి యోగాను నేర్పేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్ర‌ణాళిక‌లు రూపొందించి, అమ‌లుచేస్తోంది. ఇందులో భాగంగా శ‌నివారం జిల్లా క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో 150 మంది మాస్ట‌ర్ ట్రైన‌ర్ల‌కు శిక్ష‌ణ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మానికి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ముఖ్య అతిథిగా హాజ‌రై ప‌ర్య‌వేక్షించారు. మొరార్జీ దేశాయ్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా (ఆయుష్ మంత్రిత్వ శాఖ‌) ఆన్‌లైన్ ద్వారా శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రుగుతోంద‌న్నారు. శ‌నివారం మూడు సెష‌న్లు జ‌ర‌గ్గా, ఆదివారం రెండు సెష‌న్ల‌లో శిక్ష‌ణ ఉంటుందని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు. ఈ మాస్ట‌ర్ ట్రైన‌ర్లు మండ‌ల‌స్థాయిలో శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తార‌ని.. అక్క‌డ శిక్ష‌ణ పొందిన‌వారు గ్రామ, వార్డు స‌చివాల‌య స్థాయిలో ప్ర‌జ‌ల‌కు యోగాపై అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటు యోగాస‌నాల‌ను నేర్పిస్తార‌ని వెల్ల‌డించారు.
కార్య‌క్ర‌మంలో జిల్లా ఆయుష్ అధికారి డా. రామ‌త్లేహి, జిల్లా యోగాంధ్ర నోడ‌ల్ అధికారులు డా. ఎం.సుహాసిని, డా. జె.సుమ‌న్, యోగా ట్రైన‌ర్ రామాంజ‌నేయులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *