Breaking News

మద్యం షాపులు, బార్‌లలో నియమ నిబంధనలు సజావుగా అమలు జరిగేలా చూసేందుకు మూడు అంచెలతో స్పెషల్‌ టీములు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కమీషనర్‌, ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ వారి ఆదేశాల మేరకు జిల్లా లోని మద్యం షాపులు మరియు బార్‌లలో సమయపాలన, ఇతర నియమ నిబంధనలు సజావుగా అమలు జరిగేలా చూసేందుకు మూడు అంచెలతో స్పెషల్‌ టీములు ఏర్పాటు చేయటం జరిగిందని డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ ఆఫీసర్ ఎస్‌ శ్రీనివాసరావు అన్నారు.
విజయవాడ నగర పరిధిలోని మద్యం షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను శనివారం డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ ఆఫీసర్ ఎస్‌ శ్రీనివాసరావు, ఎన్ఫోర్సీమెంట్‌, ప్రొహిబిషన్‌ ఏక్సైజ్‌ విజయవాడ అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ యు. సుబ్బారావు వారి సిబ్బందితో కలసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని మద్యం షాపులు మరియు బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో సమయపాలన మరియు నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా ఉన్నాయా అని పరిశీలించారు. తదుపరి క్షేత్ర స్థాయి అధికారులుకు తగు సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం మద్యం వ్యాపారులకు నియమ, నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం నిర్వహించుకోవాలని సూచించారు. ఎవరైనను నిబంధనలను అతిక్రమించిన యెడల వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి, తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ ఆఫీసర్ ఎస్‌ శ్రీనివాసరావు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *