-సోమవారం మే 26 వ తేదీన యధావిధిగా పిజిఆర్ఎస్
-అర్జీలు meekosam.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకునే వెసులుబాటు
-వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 మీ సెల్ ఫోన్లలో నిక్షిప్తం చేసుకోవాలి
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలు పరిష్కార కోసం జిల్లా, డివిజన్ మండల స్థాయి లో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ మే 25 వ తేదీ సోమవారం రోజున యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు.
ప్రజలు తమ అర్జీలను ఇవ్వడం కోసం “1100 – మీకోసం కాల్ సెంటర్” కు ఫోన్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయుటకు మరియు నమోదైన మీ అర్జీ యొక్క స్థితిగతులు తెలుసుకో వచ్చునని ఆమె తెలిపారు. అర్జీలు పరిష్కారం కోసం అర్జీదారులు meekosam.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. నేరుగా అర్జీలు ఇవ్వలేని వారు మీ కోసం వెబ్ సైట్ లో ఆన్లైన్ ద్వారా మీ ఫిర్యాదు నమోదు చేయవచ్చు అని తెలియ చేశారు. జిల్లా కలెక్టరేట్లో అదే విధంగా డివిజన్, మునిసిపల్ , మండల కేంద్రంలో మే 19 ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ప్రజల నుంచి పీజీఆర్ఎస్ అర్జీలను స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక అధికారులు , జిల్లా, డివిజన్ మండల, మునిసిపల్ క్షేత్ర స్థాయి అధికారులు తప్పనిసరిగా హజరు కావాలని స్పష్టం చేశారు. ప్రజలు వ్యయ ప్రయసలుపడి ప్రభుత్వ కార్యాలయాలకు వొచ్చి ఫిర్యాదు చెయ్యకుండా “1100” టోల్ ఫ్రీ నెంబర్ కు నేరుగా తమ సమస్యలను తెలియ చేయడం ద్వారా , గతంలో అందచేసిన అర్జిల స్థాయి కూడా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. సత్వర పౌర సేవలను పొందేందుకు 9552300009 ఈ గవర్నెన్స్ ను తమ సెల్ ఫోన్లలో నిక్షిప్తం చేసుకోవాలని జిల్లా ప్రజలకి కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News