Breaking News

ఈ నెల 26 వ తేది నుండి (నేటి నుండి) ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటవరకు పిజి ఆర్ ఎస్

-ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్, మండల కేంద్రంలో జరుగుచున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమం ఇక నుండి ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంట వరకు నిర్వహణ: జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త
ప్రతి సోమవారం జిల్లా కేంద్రం తిరుపతి జిల్లా కలెక్టరేట్ నందు మరియు రెవిన్యూ డివిజన్ , మండల కేంద్రాలలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ నెల 26 వ తేదీ నుండి (నేటి నుండి) ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటవరకు ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో ఎండ ప్రభావం తగ్గి వున్నందున ప్రజల సౌకర్యార్థం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంట వరకు జిల్లా కలెక్టరేట్ తో పాటుగా డివిజన్, మండల కేంద్రాలలో నిర్వహించే ప్రజా సమస్యల పరిస్కార వేదిక లో ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించడం జరుగుతుందని ప్రజలు ఈ మార్పును గమనించి సద్వినియోగం చేసుకోగలరని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అందరు కలెక్టరేట్ నందు నిర్వహించే పీజీ ఆర్ ఎస్ కార్యక్రమానికి, అలాగే డివిజన్, మండల కేంద్రాల్లో పీజీఆర్ఎస్ కు సంబంధిత అన్ని శాఖల అధికారులు ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంట వరకు తప్పక హాజరు కావాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *