Breaking News

సజావుగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 పరీక్షలు

-యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 రాత పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన స్టేట్ అబ్జర్వర్ కోన శశిధర్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్
-యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 రాత పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన యూపీఎస్సీ జాయింట్ సెక్రటరీ ఎస్. జి అజ్మీరా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త
ఆదివారం ఉదయం జిల్లా నందు జరుగుతున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 పరీక్షలను శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పి. జి కళాశాల శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజీ అఫ్ సైన్స్ నందు రాత పరీక్ష కేంద్రాలను స్టేట్ అబ్జర్వర్ మరియు జిల్లా ప్రతేక అధికారి శ్రీ కోన శశిధర్, జాయింట్ సెక్రటరీ ఎస్. జి అజ్మీరా గారు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేసారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 రాత పరీక్ష కేంద్రాలను జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు తనిఖీ చేసారు

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 రాత పరీక్ష కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలను నిర్వహించాలని సంబందిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 రాత పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, అలాగే పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరం, త్రాగునీరు, మౌలిక సదుపాయాలు ఏర్పాట్లను పరిశీలించారు. వేసవి ఎండల దృష్ట్యా పరీక్షలు రాసే విద్యార్థులు అస్వస్థకు గురికాకుండా తక్షణం వైద్య సేవలు అందించేందుకు ఓఆర్ఎస్, అత్యవసర మందులు అందుబాటులో ఏర్పాటు చేశామని తెలిపారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు తావులేకుండా పగడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని పరీక్షల నిర్వహణ సిబ్బందికి కలెక్టర్ సూచించారు.

జిల్లాలో నేడు జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 ఉదయం రాత పరీక్షలకు మొత్తం 5261 మంది అభ్యర్థులకు గాను 2941 (55.90 %) మంది అభ్యర్థులు హాజరయ్యారని, 2320 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. అలాగే మధ్యాహ్నం పరీక్షలకు మొత్తం 5261 మంది అభ్యర్థులకు గాను 2929(55.67 %) మంది అభ్యర్థులు హాజరయ్యారని, 2332 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *