మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ప్రగతిని పుస్తక రూపంలో తీసుకురానున్నామని, అందుకు సంబంధించిన ప్రగతి నివేదికను సమర్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి పుస్తకం తయారీ కోసం వివిధ ప్రభుత్వ శాఖలు సమర్పించవలసిన ప్రగతి నివేదికపై అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సర కాలంగా సాధించిన ప్రగతిపై ఒక పుస్తకం తయారు చేస్తున్నామని, వివిధ ప్రభుత్వ శాఖలు అందుకు సంబంధించిన వివరాలను త్వరితగతిన సమర్పించాలన్నారు.
ఆయా శాఖలు చేపట్టిన ప్రధాన అభివృద్ధి పనులను తెలియజేస్తూ క్లుప్త నివేదికను అందించాలన్నారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య, జిల్లా పంచాయతీ, ఉపాధి హామీ పథకం, డి ఆర్ డి ఏ, మున్సిపల్, ఆర్డబ్ల్యూఎస్, పీఎం సూర్యఘర్, వరదల సమయంలో అందించిన సేవలు, వ్యవసాయ అనుబంధ శాఖలు, పరిశ్రమలు ఉపాధి కల్పన, రహదారులు భవనాలు, గృహ నిర్మాణం తదితర శాఖలు ప్రత్యేక దృష్టి సారించి నివేదికను సిపిఓ కి సమర్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్వో కే చంద్రశేఖరరావు, కే ఆర్ ఆర్ సీ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, జడ్పీ ఇంచార్జి సీఈఓ ఆనంద్ కుమార్, సిపిఓ ఎస్ భీమరాజు, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణరావు, డీఈవో పీవీజే రామారావు, సమగ్ర శిక్ష ఏపీసీ కుముదిని సింగ్, డిపిఓ జే అరుణ, డ్వామా,డిఆర్డిఏ పిడీలు శివప్రసాద్, హరిహరనాథ్, జిల్లా వ్యవసాయ అధికారి మనోహర్, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ శర్మిష్ట, డిఎస్ఓ వి పార్వతి, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి వెంకటరావు, విద్యుత్ శాఖ ఎస్ఈ సత్యానంద్, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్, డిటి డబ్ల్యూ ఓ ఫణి ధూర్జటి, ఐసిడిఎస్ పిడి ఎంఎన్ రాణి, డి ఎస్ డి ఓ ఝాన్సీ లక్ష్మి, అటవీ శాఖ అధికారిణి సునీత తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News