Breaking News

హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్స్ టెక్నాలజీ డిప్లమా కోర్సుల్లో ప్రవేశం కొరకు దరఖాస్తులు ఆహ్వానం 

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా, వెంకటగిరిలోగల ఎస్ పీ కే యం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ నందు 53 సీట్లకు, తమిళనాడులోని సేలం నందు 12 సీట్లకు, కర్ణాటకలోని గడగ్ నందు 4 సీట్లకు మూడు సంవత్సరముల హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్స్ టెక్నాలజీ డిప్లమా కోర్సుల్లో ప్రవేశం కొరకు దరఖాస్తులను వచ్చే జూన్ నెల 1వ తేదీ వరకు ఆహ్వానిస్తున్నట్లు ఆ ఇన్స్టిట్యూట్ ఓ. ఎస్. డి ఎస్ గిరిధర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పదవ తరగతి లేదా తత్సమాన మైన పరీక్షల్లో ఉత్తీర్ణత పొంది ఉండాలని, జూలై నెల 1 తేదీ నాటికి బీసీ, జనరల్ కేటగిరి లకు 15 నుండి 23 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలని, షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి 25 సంవత్సరాల వరకు వయస్సు కలిగి ఉండాలన్నారు.

లెటర్ ఎంట్రీ క్రింద మూడు సంవత్సరాల డి హెచ్ టిటి కోర్సు నందు, ఇంటర్మీడియట్ ఎంపీసీ, ఇంటర్మీడియట్ ఒకేషనల్( టెక్స్ టైల్స్), ఐటిఐ(2 సంవత్సరములు) కోర్సులందు ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నేరుగా డి హెచ్ టి టి రెండవ సంవత్సరం నందు ప్రవేశముల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం మే, జూన్ మాసాలలో దరఖాస్తులు, ప్రవేశాలు ఉంటాయన్నారు. ఇతర వివరములు దరఖాస్తులు పొందుట కొరకు www. iihtvgr.com వెబ్సైట్ చూడాలని తెలిపారు. అప్పరల్ అండ్ గార్మెంట్ మేకింగ్ టెక్నాలజీ లో ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు.

ఇతర వివరాలకు 08625-295003, 9399936872, 9866169908, 9010243054 సంప్రదించాలని ఆయన కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *