Breaking News

మంగినపూడి బీచ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగినపూడి బీచ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టెండర్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి సంబంధిత అధికారులతో మంగినపూడి బీచ్ ఉత్సవాల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే జూన్ నెల మొదటి వారంలో జరగనున్న మంగినపూడి బీచ్ ఉత్సవాలను కట్టుదిట్టంగా నిర్వహించాల్సి ఉందన్నారు.

ఇందులో భాగంగా వివిధ ప్రదర్శనశాలలు, వంటశాలలు, బీచ్ కబడి, కయాకింగ్, పోటీల నిర్వహణ, పిల్లల వినోద క్రీడలు, మంచినీరు, మరుగుదొడ్లు, వేదికలు, విద్యుత్ దీపాలు అలంకరణ, సాహస క్రీడలు, గ్యాలరీలు తదితర ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు. వీటన్నిటిని ఏర్పాటు చేయుటకు వీలుగా టెండర్లు పిలవాల్సి ఉందన్నారు.పర్యాటక శాఖ, బ్రేవరేజెస్ కార్పొరేషన్ సమకూర్చే నిధులతో టెండర్లను ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఇందుకోసం సంయుక్త కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని అందులో మెప్మా, రహదారులు భవనాలు, పంచాయతీరాజ్, మున్సిపల్ కమిషనర్ విద్యుత్ శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారన్నారు. ఆ కమిటీ బీచ్ లో ఏర్పాటు చేయవలసినా వసతులకు సంబంధించి ధరలు నిర్ధారించి త్వరితగతిన టెండర్లు పిలవాలన్నారు. బీచ్ ఉత్సవాలలో చేస్తున్న ఏర్పాట్లకు సంబంధించి ఖర్చు కాగల అంచనా వివరాలను పొందుపరుస్తూ పర్యాటక శాఖకు, బ్రేవరేజెస్ కార్పొరేషన్ కు పంపుటకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు, మెప్మా పీడీ సాయిబాబు, పంచాయతీరాజ్ ఎస్ ఇ రమణ రావు, రహదారులు భవనాల శాఖ ఈఈ లోకేష్, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *