Breaking News

ఉపాధ్యాయుల్లో వృత్తిపరమైన ప్రమాణాలు పెంచుటకు శిక్షణ

-పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు. వి. IAS., 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్య, పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయ్ రామరాజు.వి IAS., అన్నారు. సోమవారం కె.ఎల్. యూనివర్శిటీ (వడ్డేశ్వరం, గుంటూరు)లో ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో 416 రాష్ట్ర స్థాయి రిసోర్సు పర్సన్లు (SRPs) కోసం మూడు రోజుల రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయ్ రామరాజు.వి IAS., జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకడమిక్ క్యాలెండర్, టీచర్స్ హ్యాండ్‌బుక్, విద్యార్థుల అసెస్‌మెంట్ బుక్‌లెట్‌లు, లీప్ యాప్ మొదలైన వాటిపై అందిస్తున్న ఈ శిక్షణ ఉపాధ్యాయుల్లో వృత్తిపరమైన ప్రమాణాలను పెంచుతుందని, ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను సాధిస్తుందని అందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని , ఉపాధ్యాయులు విద్యా సంవత్సరం అంతా పూర్తిగా విద్యాబోధనకే అంకితం అవ్వాలని, విద్యా సంవత్సరం ప్రారంభం రోజు నుండి వారం వారీ, నెలవారి తయారుచేసిన ప్రణాళికలు పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం లో అమలు చేయబోతున్నట్లు తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో 3,6,9 తరగతి విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్స్ నిర్వహించబోతున్నట్లు తెలియజేశారు. నెలవారి జరిగే క్లస్టర్ సమావేశాలు కూడా ఉపాధ్యాయుల నైపుణ్యాల పెరుగుదలతో పాటు విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచుటకు మరింత ఉపయోగపడుతుందని తెలిపారు. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా ఉపాధ్యాయుల్లో మెరుగైన వృత్తిపరమైన నైపుణ్యాలు పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ రిజిస్టర్ Dr K. సుబ్బారావు Dean KRS ప్రసాద్, ఎస్ఎస్సి ఇఆర్టి ఫ్యాకల్టీ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *