Breaking News

20 రోజు ఎపి మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికులు నిరసన కార్యక్రమం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఆంధ్రప్రదేశ్‌ మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ కార్మికుల జీతం పెంపుదల కోసం నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. సోమవారం ధర్నా చౌక్‌లో ఆంధ్రప్రదేశ్‌ మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ 20 రోజు నిరసన కార్యక్రమంలో అధ్యక్షులు పిట్టా మహేష్‌బాబు మాట్లాడుతూ… అత్యవసర విభాగం అయినటువంటి నీటి సరఫరా, వీధి దీపాలు డ్రైనేజీ, పార్క్‌లు, మెకానిక్‌లు, టౌన్‌ ప్లానింగ్‌ మరియు ఇంజనీరింగ్‌ అన్ని విభాగాల వారికి టెక్నికల్‌ రూ. 29,200, నాన్‌ టెక్నికల్‌ రూ.24,500 జీతాలు చెల్లించాలని, 10 సంవత్సరాలు పైబడిన ఇంజనీరింగ్‌ మున్సిపల్‌ కార్మికులను క్రమబద్దీకరించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలన్నారు. ఎపిసిఓఎస్‌ రద్దు చేస్తే కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలన్నారు. పర్మినెంట్‌ కార్మికుల వలే మాకు కూడా పదవీ విరమణ వయసును ఎపిసిఓఎస్‌ కార్మికులందరినీ 60 సం॥ నుండి 62 సం॥లకు పెంచాలని, ఇతర ఉద్యోగుల మాదిరిగా గ్రాడ్యూటీతో పాటు కనీస పెంక్షన్‌ రూ. 10,000లు ఇవ్వాలంటూ తదితర డిమాండ్లను తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎం.డి.గౌస్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.కోటేశ్వర్‌గౌడ్‌ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి బత్తుల శివశంకర్‌, గౌరవ అధ్యక్షులు గుంటుపల్లి శేషగిరిరావు, ఉపాధ్యక్షులు పర్సాబుచ్చిబాబు, వేముల జయపాల్‌ తదితరులు, నీటి సరఫరా, వీధిదీపాలు, డ్రైనేజీ, పార్క్‌ సిబ్బంది, వివిధ విభాగాల కార్మికులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *