Breaking News

ప్రజలు ఇబ్బందులు లేకుండా టెండర్ పొందిన పనులను త్వరగా ప్రారంభించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వర్షాల వలన లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు లేకుండా టెండర్ పొందిన పనులను త్వరగా ప్రారంభించాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం విద్యా నగర్, కృష్ణ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డ్ ల వారీగా టెండర్ పొందిన పనులను జాప్యం లేకుండా జరిగేలా ఇంజినీరింగ్ అధికారులు యాక్షన్ ప్లాన్ చేసుకోవాలన్నారు. వర్షాల వలన లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా ప్రతిపాదించిన రోడ్లు, డ్రైన్లను తక్షణం ప్రారంభించి, వేగంగా జరిగేలా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. పనుల్లో జాప్యం జరిగితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు కనుక ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నూతన బహుళ అంతస్తు భవన నిర్మాణదారులు తప్పనిసారిగా డ్రైన్ ని మేజర్ డ్రైన్ లోకి కనెక్ట్ చేసేలా, ర్యాంప్ లు రోడ్ల మీదకు రాకుండా పట్టణ ప్రణాళిక అధికారులు, కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో రోజువారి చెత్త సేకరణకు ప్రజారోగ్య కార్మికులు రావడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని, సచివాలయం పరిధిలో నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ భాధ్యత శానిటేషన్ కార్యదర్శిదేనని స్పష్టం చేశారు.
పర్యటనలో ఏసిఫై రెహ్మాన్, టిపిఎస్ సత్యనారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *