గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మాస వారి తనిఖీలలో భాగంగా మంగళవారం ఉదయం గుంటూరు కలక్టరేట్ ఆవరణలోని ఇవియంలు భద్రపరిచిన గోడౌన్ ను జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ తనిఖీ చేసారు. సీసీ టీవి పనితీరు , అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. గోడౌన్ వద్ద భద్రత సిబ్బంది లాగ్ బుక్ ను పరిశీలించారు. ఇవియంల భద్రత విషయంలో రాజీపడకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఆదేశించారు. ఇవియం ల పరిశీలనలో డిఆర్ఓ ఎన్‌ఎస్‌కే.ఖాజావలి, ఆర్డిఓ కె. శ్రీనివాస రావు , అడిషనల్ జిల్లా అగ్నిమాపక అధికారి కె.కృష్ణా రెడ్డి, గుంటూరు పశ్చిమ మండల తహశీల్దార్ కె.వేంకటేశ్వర రావు, ఆర్ అండ్ బి ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.నాగేశ్వర రావు, ఎలక్ట్రికల్ డివిజన్ డిఈ ఏ.కాళీ మాత, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News