Breaking News

కార్యకర్తలే ‘దేశం’ బలం

-జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత

కడప, నేటి పత్రిక ప్రజావార్త :
పెనుకొండ నుంచి టీడీపీ మహానాడులో పాల్గొనడానికి సైకిల్ యాత్రగా వచ్చిన తెలుగు తమ్ముళ్లను జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత, టీడీపీ ధర్మవరం నియోజక వర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ అభినందించారు. కడప పబ్బావరంలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు ప్రాంగణం వద్ద పెనుకొండ నుంచి సైకిల్ యాత్రగా వచ్చిన తెలుగు తమ్ముళ్ల బుధవారం సందడి చేశారు. సైకిల్ పై వచ్చిన టీడీపీ కార్యకర్తలను మంత్రి సవితతో పాటు టీడీపీ ధర్మవరం నియోజక వర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ అభినందించారు. ఈ సందర్బంగా మంత్రి సవిత మాట్లాడుతూ, కార్యకర్తలే టీడీపీకి బలమన్నారు. పార్టీ అధిష్టానం కూడా కార్యకర్తలకు పెద్దపీట వేస్తోందన్నారు. మంత్రి సవిత అనంతరం వారితో సెల్ఫీకి దిగారు. ఈ సందర్భంగా జై చంద్రబాబు, జై టీడీపీ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *