Breaking News

పదో తరగతి మూల్యాంకనంలో ఒకటి, రెండు చోట్ల తప్పిదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి

-బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
-బాధిత విద్యార్ధులు నష్టపోకుండా చూడాలని సూచన

కడప, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో పలువురు విద్యార్ధులు నష్ట పోయేలా ఒకటి, రెండు చోట్ల జరిగిన తప్పిదాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. రీవాల్యూయేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న తర్వాత విద్యార్ధుల మార్కుల్లో వ్యత్యాసం కనిపించడాన్నితీవ్ర తప్పిదంగా ముఖ్యమంత్రి పరిగణించారు. నష్టపోయిన విద్యార్ధులకు ఇంటర్ ప్రవేశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. తప్పిదానికి బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుని, వెంటనే నివేదికను సమర్పించాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వ్యవస్థాత్మక సంస్కరణలు తీసుకురావాలని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *