Breaking News

జిల్లా లో 12 నుంచి 20 వరకు పాఠశాలల్లో తప్పనిసరిగా యోగ కార్యక్రమం చేపట్టాలి…

-అధిక వర్షాలు హెచ్చరికలు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా లో ప్రజలందరూ యోగాంధ్ర లో స్వచ్ఛందంగా భాగం కావాలని, నమోదు చేయడం కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టవలసి ఉందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్, యోగాంధ్ర జిల్లా నోడల్ అధి కారి ఎస్ చిన్న రాముడు ఇతర అధికారులు యోగాంధ్ర, పీఎం సూర్య ఘర్, పర్సెప్షన్ సర్వే పై జిల్లా అధికారులతో సమావేశం అవుతూ జిల్లాలోని ఎంపీడీవో లతో మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ యోగా పై ప్రతి మండలంలో పోటీలు నిర్వహించా లన్నారు. మెడిటేషన్, సూర్య నమస్కారాలు, యోగాలో ఉన్న ఆసనాలను వివిధ కేటగిరీలుగా విభజించి పోటీలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని వర్గాలను భాగస్వామ్యం చేయడం లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ, అంగన్వాడీ, వ్యవసాయ శాఖ రైతులతో యోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమం లో స్వచ్ఛందంగా ముందుకు వొచ్చే వారి వివరాలు ఆన్లైన్లో రిజిస్ట్రే షన్ లు టార్గెట్ ప్రకారం చేయించాలని తెలిపారు. గ్రామాల్లో ఐదు సెంటర్లు కచ్చితంగా ఎంచుకొని గ్రామాల్లోని ప్రజలతో యోగా చేయించాలని తెలిపారు. మాస్టర్ ట్రైనర్స్ యోగ పై సుమారు పదిమందికి తక్కువ కాకుండా యోగ పై శిక్షణ ఇవ్వాలని తెలిపారు. యాప్ లో తప్పనిసరిగా ప్రతిరోజు యోగ పై నమోదు చేయాలని తెలిపారు. అంగన్వాడి సెంటర్లలో గర్భిణీ స్త్రీలు, జాతీయ గ్రామీణ ఉపా ధి హామీ పథకం కూలీలతో ఒక వేదికను ఏర్పాటు చేసు కొని యోగా చేసే విధంగా అందరికీ అవగాహన కల్పిం చాలన్నారు.

ప్రతి గ్రామం / వార్డు ప్రచారంలో పాల్గొనేలా చూడటం ద్వారా ప్రతి మండలం, వార్డు మరి యు గ్రామంలో పౌర నమోదు లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ ఆదేశించారు. శిక్షకులతో శిక్షణలు నాణ్యతతో మరియు ప్రోటోకాల్‌ల ప్రకారం నిర్వహించాలన్నారు. ఇందుకు వ్యక్తిగతంగా శిక్షణలను పర్యవేక్షణ చెయ్యడం తప్పనిసరి అన్నా రు. ప్రాధాన్యతా ప్రాతిపదికన పూర్తి చేయడానికి మాస్టర్ ట్రైనర్స్ తో మ్యాపింగ్ చేయాలన్నారు.  శిక్షకుల పేర్లు నమోదు చేసుకునే అవకాశం జూన్ 2 వరకు పొడిగించడం జరిగిందని, అందుకు అనుగు ణంగా మాస్టర్ ట్రైనర్స్ గుర్తించి, ఆయా ప్రాంతాల్లో సర్వే ద్వారా ఆసక్తి చూపిన ప్రజలను మ్యాపింగ్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి మాస్టర్ ట్రై నర్లు మరియు ట్రైనర్ల లాగిన్లు ఇవ్వడం జరిగిందని, శిక్షణా తరగతులు హాజరైన శిక్షకులనీ హాజరును గుర్తించి, మండల స్థాయి అధికారులు ధృవీకరణను నిర్ధారించాల్సి ఉంటుందన్నారు. జూన్ 3 నుండి పౌరులకు శిక్ష ణ కార్యక్రమం కోసం  షెడ్యూల్ రూపొందించడం జరిగిందనీ,  పౌరులకు శిక్షణ ఇవ్వడానికి ప్రతి గ్రామం/వార్డుకు సూక్ష్మ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. వేదికలను గుర్తించి అన్ని – పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ప్రొజెక్టర్ మరియు ఇతర  లాజిస్టికల్ ఏర్పాట్లు చేయండం ద్వారా యోగాంధ్ర కార్యక్రమం ప్రజల్లోకి సమర్ధవంతంగా తీసుకుని వెళ్లడం సాధ్యం అవుతుందని తెలిపారు.

జాన్ 8 వ తేదీ న సీనియర్ సిటిజన్స్ తో జిల్లా, డివిజన్, మండల కేంద్రం లో  ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం పై ఇప్పటి నుంచి కార్యాచరణ రూపొందించాలన్నారు. యోగా పోటీలలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయడం పట్ల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని తెలిపారు జూన్ 12 నుంచి 20 వరకు పాఠశాలల్లో తప్పనిసరిగా యోగా కార్యక్రమాలు చేపట్టడం పై దృష్టి సారించాలని ఆదేశించారు. తుఫాన్లు వచ్చే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు మండల అధికారులు సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. భారీ వర్షాల కారణంగా నీరు నిలవకుండా డ్రైనేజీల్లో పూడికతీత పనులు చేపట్టడం పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా నీరు కలుషితం అవ్వకుండా చూడాలని తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు నీటి శాంపిల్స్ ను పంపించి నీటిని పరిశీలించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాత భవనాలు కోల్పోయే ప్రమాదం ఉందని, మండల తాహాసిల్దార్లు, వీఆర్వోలతో ప్రతి గ్రామంలో పరిశీలించి పాత భవనాలు, ఏమి ఉన్నాయో గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసు కోవాలని తెలిపారు.

జూన్ 5వ తేదీన హరిత ఆంధ్రప్రదేశ్ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించాలని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని సూచించారు.

సహజ వనరుల సంరక్షణ విషయంలో భాగంగా ప్రతి సొంత ఇళ్లు కలిగిన లబ్దిదా రులు పీఎం సూర్య ఘర్ పధకం సద్వినియోగం చేసుకొని విధంగా చర్యలు తీసుకోవాల ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు.  వివిధ వర్గాల వారికి ప్రభుత్వం అందచేస్తున్న సబ్సిడీ పొందే అవకాశం పై ప్రజలకి అవగాహన కల్పించాలని సూచించారు. పీఎం సూర్య ఘర్ పధకం లో నమోదు కోసం జిల్లా గ్రామీణాభివృద్ధి, మెప్మా ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వ్యక్తిగత, గ్రూప్ హౌసెస్, అపార్ట్మెంట్ లలో కూడా పీఎం సూర్య ఘర్ పధకం వర్తింపు కు చెందిన మార్గదర్శకాలు ఉన్నా యని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.ప్రశాంతి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డీఆర్వో టి. సీతా రామమూర్తి, సిపిఓ / జె డి ఎల్ అప్పల కొండ, డిఆర్డిఏ పిడి, ఎన్. వి వి ఎస్. మూర్తి, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కే ఎన్ జ్యోతి, డీఈవో కే వాసుదేవరావు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *