Breaking News

తిరుపతి సమాచార శాఖలో ఎ.వి సూపర్ వైజర్ గా పని చేసి పదవీ విరమణ చేసిన పుల్లయ్య సేవలు మరువలేనివి…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సమాచార శాఖలో వివిధ హోదాలలో పని చేసి ఎ.వి సూపర్వైజర్ గా నేడు పదవీ విరమణ చేసిన వై.పుల్లయ్య సేవలు మరువలేనివని, ఆయురారోగ్యాలతో ఉండాలని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాల కొండయ్య తదితర సమాచార శాఖ అధికారులు పేర్కొన్నారు. తిరుపతి సమాచార శాఖలో ఎ .వి.సూపర్వైజర్ గా పనిచేసిన పుల్లయ్య శనివారం పదవీ విరమణ చేసిన సందర్భంగా కలెక్టరేట్ లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో తిరుపతి జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాల కొండయ్య మాట్లాడుతూ నేడు పదవీ విరమణ చేసిన ఎ.వి సూపర్వైజర్ పుల్లయ్య సమాచార శాఖలో ఎనలేని సేవలు చేశారని తెలిపారు. సుమారు 39 సంవత్సరాలు సుదీర్ఘoగా సమాచార శాఖలో పనిచేసిన ఆయన ముందు చూపుతో అధికారి అప్పజెప్పిన పనులను సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించే వారని కొనియాడారు.

పదవీ విరమణ చేసిన ఏవి సూపర్వైజర్ పుల్లయ్య మాట్లాడుతూ… తాను 1985 అక్టోబర్ 25వ తారీఖున సినీ ఆపరేటర్ గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరానని అప్పటినుండి తన విధులను అధికారులు చెప్పిన విధంగా వారి సూచనలు పాటిస్తూ తన వృత్తి ధర్మాన్ని చేశానని తెలిపారు. అధికారులు, సిబ్బంది అందరి సహకారంతో తాను సమాచార శాఖలో 39 సం.ల 7 మాసములు సర్వీసులో సంతృప్తికరంగా విధులు నిర్వహించడం జరిగిందన్నారు. ఇందుకు సహకరించిన అధికారులకు, సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం సమాచార శాఖ అధికారులు, సిబ్బంది, పుల్లయ్య ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పిఆర్ఓ ఈశ్వరమ్మ, ఎ పి ఆర్ ఓ గోపి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *