Breaking News

సుజనా చౌదరి జన్మదినం సందర్భంగా నిర్మల హృదయ భవన్ పిల్లలకు నిత్యవసరాలు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పశ్చిమ లోని ఎన్డీఏకూటమి కార్పొరేటర్లు, మైలవరపు దుర్గారావు, మహాదేవు అప్పాజీరావు మరుపిళ్ళ రాజేష్, అత్తలూరి ఆదిలక్ష్మి పెద్దబాబు, మైలవరపు కృష్ణ, బుల్లా విజయ్ కుమార్, ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) రాఘవయ్య పార్క్ వద్దగల నిర్మల హృదయ భవన్ లో నిత్యవసర సరుకులను అందించారు. అనాధ పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి సుజనా జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.250 కేజీల బియ్యం తో పాటు గోధుమపిండి, కందిపప్పు, సన్ ఫ్లవర్ ఆయిల్, బ్రెడ్ ప్యాకెట్లను అందించామని కార్పొరేటర్లు తెలిపారు. మదర్ తెరిసా ఆశయాలకి అనుగుణంగా సేవలు అందిస్తున్న నిర్మల్ హృదయ్ భవన్ లో సుజనా జన్మదినోత్సవ వేడుకలను జరుపుకోవడం సంతృప్తినిచ్చిందని కార్పొరేటర్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *