Breaking News

ఔష‌ధ మొక్క‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పిద్దాం

– ప్ర‌తి ఇంటికీ ఆరోగ్య ఫ‌లాలు అందించ‌డంలో స‌మ‌ష్టిగా కృషిచేద్దాం
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఔష‌ధ మొక్క‌ల ప్ర‌యోజ‌నాల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని, మిద్దె తోట‌ల్లో ఔష‌ధ మొక్క‌లు పెంచేలా ప్రోత్స‌హించాల‌ని.. ఈ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మంలో అధికారుల‌తో పాటు స్వ‌చ్ఛంద సంస్థ‌ల భాగ‌స్వామ్యం ముఖ్య‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.
సోమ‌వారం ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌రేట్‌లో వ‌న్ ఎర్త్‌-వ‌న్ లైఫ్ (టెర్ర‌స్ గార్డెన్ గ్రూప్‌) స‌హ‌కారంతో క‌లెక్ట‌రేట్‌లో ఏర్పాటుచేసిన ధ‌న్వంత‌రి వ‌నాన్ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ప్రారంభించారు. అక్కల కర్ర, నల్ల ఉమ్మెత్త, నేపాలం, చిత్రమూలం, తాని త‌దిత‌ర ఔష‌ధ గుణాలు క‌లిగిన 40 ర‌కాల ఔష‌ధ మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని స్వ‌యంగా మొక్కనాటి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ ప్ర‌జ‌లంద‌రూ ఆరోగ్య‌క‌రంగా జీవించ‌డానికి ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించ‌డంతో పాటు సేంద్రియ ప‌ద్ధ‌తిలో పంట‌ల‌ను పండించేలా ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. జిల్లాలో ఇప్ప‌టికే ప్ర‌కృతి వ్య‌వ‌సాయంపై పెద్దఎత్తున రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నామ‌న్నారు. ఇదేవిధంగా ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉప‌యోగ‌ప‌డే ఔష‌ధ మొక్క‌ల‌పైనా అవ‌గాహ‌న క‌ల్పించి, ఇంట్లోనే పెంచుకునేలా ప్రోత్స‌హించ‌డంలో స‌మ‌ష్టి కృషి అవ‌స‌ర‌మ‌న్నారు. మిద్దె తోట‌ల పెంప‌కాన్ని ఓ ఉద్య‌మంలా తీసుకెళ్లేందుకు వ‌న్ ఎర్త్ – వ‌న్ లైఫ్ చేస్తున్న కృషి అభినంద‌నీయ‌మ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు.
కార్య‌క్ర‌మంలో వ‌న్ ఎర్త్‌-వ‌న్ లైఫ్ ప్ర‌తినిధులు ఏలూరి లీలా కుమారి, మ‌ద్దిరాల క‌మ‌లాక‌ర్‌, విజ‌య‌కుమార్ వెల‌గ‌, పాల‌డుగు సురేష్ త‌దిత‌రుల‌తో పాటు పీసీబీ ఎన్విరాన్‌మెంట‌ల్ ఇంజ‌నీర్ పి.శ్రీనివాస్‌, క‌లెక్ట‌రేట్ ప‌రిపాల‌న అధికారి ఎస్‌.శ్రీనివాస్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *