Breaking News

విద్యాహక్కు చట్టం కింద ఉచిత నిర్బంధ ప్రవేశాల నిర్ధారణ కోసం ఈ నెల 10 వరకు గడువు పెంపు

-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యాహక్కు చట్టం ప్రకారం 2025-26 విద్యా సంవత్సరానికి అన్ని అన్ ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు సంబంధించి లాటరీ విధానంలో మొదటి విడత ఫలితాల తుది జాబితా గత నెల 29న సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలి విడతలో 23,117 మందికి సీట్లు కేటాయించి, సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేశామని తెలిపారు. పాఠశాలలకు కేటాయించిన విద్యార్థులు తగిన ధ్రువీకరణ పత్రాలతో సంబంధిత పాఠశాలలకు వెళ్లి జూన్ 7లోపు ప్రవేశాలను నిర్ధారించుకోవలసి ఉండగా, 7న బక్రీద్, 8న ఆదివారం సెలవులు కారణంగా జూన్ 10వ తేదీకి గడువు పొడిగించామని ఎస్పీడీ బి.శ్రీనివాసరావు తెలిపారు. రెండో విడత ఫలితాలను జూన్ 14న విడుదల చేసి, సీట్లు పొందిన విద్యార్థుల ప్రవేశాల నిర్ధారణ జూన్ 21న ఖరారు చేస్తామని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *