Breaking News

మెగా DSC–2025 పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం

– తొలిరోజు పరీక్షలు విజయవంతంగా ముగింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా మెగా DSC–2025 నియామక పరీక్షలు 06.06.2025న ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం మరియు మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగ్గా, అవి పూర్తిగా ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అంతరాయాలు లేకుండా సజావుగా నిర్వహించబడ్డాయి.
ఉదయం రాష్ట్రవ్యాప్తంగా 91 పరీక్షా కేంద్రాలలో నిర్వహించబడిన TGT(NL)-Mathematics (English Medium), TGT-Hindi-VH, TGT-Physical Science – HH, TGT-Physical Science –VH, TGT (L) – Telugu – HH పరీక్షలకు గాను దరఖాస్తు చేసిన 16102 అభ్యర్ధులకు గాను 14,281 అభ్యర్థులు (88.69%) పరీక్షకు హాజరయ్యారు.
మధ్యాహ్నం 51 కేంద్రాల్లో జరిగిన TGT (NL) – Mathematics (English Medium), TGT – Mathematics – HH పరీక్షలకు గాను దరఖాస్తు చేసిన 8,790 అభ్యర్ధులకు గాను 7,611 (86.7%)అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జిల్లా వారీగా పరిశీలిస్తే, ఉదయం కడప జిల్లాలో అత్యధికంగా 91.1% హాజరు నమోదు కాగా, మధ్యాహ్నం నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 92% హాజరు నమోదైంది. పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యాధికారులు, మరియు రాష్ట్ర పరిశీలకులు నేరుగా పర్యవేక్షించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, సమర్థత కోసం అన్ని జిల్లాల కేంద్రాలలో మరియు రాష్ట్ర స్థాయి కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామని తెలిపారు. తొలిరోజు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని మెగా DSC–2025 కన్వీనర్ ఎం.వి.కృష్ణా రెడ్డి తెలియ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *