Breaking News

స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ లో ఆంధ్రప్రదేశ్ ప్రతిభ

-ఆంధ్రప్రదేశ్ నుండి 57 వినూత్న ఆవిష్కరణలు ఎంపిక
-అభినందించిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ (SIM) 2024-25లో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపికైన 1000 సృజనాత్మకత ఆష్కరణల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 57 ఆవిష్కరణలు ఎంపికైనట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., ఒక ప్రకటనలో తెలిపారు.
జాతీయ విద్యా విధానం (NEP) 2020 నాలుగో వార్షికోత్సవం సందర్భంగా, పాఠశాల విద్యా & అక్షరాస్యత విభాగం, విద్యా మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ (AIM), విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్ (MIC), AICTE సంయుక్తంగా “స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్” (SIM)-2024-25ను ప్రారంభించాయి.
ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్‌ నుండి 5443 పాఠశాలలు, 12978 మంది ఉపాధ్యాయులు నమోదు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 21625 బృందాలు 61027 మంది విద్యార్థులతో 8748 ఆవిష్కరణలు సమర్పించగా, అందులో 57 మన రాష్ట్రం నుండి 57 వినూత్న ఆలోచనల ఎంపిక కావడం గర్వకారణమని, జిల్లా సైన్స్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు మరిన్ని వినూత్న ప్రాజెక్టులను అభివృద్ధి చేసి మరిన్ని అవార్డులు, గుర్తింపులు పొందాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని సామాజిక సమస్యలకు వినూత్న ఆవిష్కరణలు అభివృద్ధి చేయడానికి సమగ్ర శిక్షా విద్యార్థులను నిత్యం ప్రోత్సహిస్తుందని తెలిపారు. యూనిసెఫ్, విజ్ఞాన్ ఆశ్రమం రాష్ట్రంలో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ బలోపేతం చేయడానికి మద్దతు ఇస్తున్నాయని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *