-స్వీయ నియంత్రణ కోసం యోగా సాధన చెయ్యాలి
-కడియం నర్సరీ లో శనివారం 12 వ రోజు యోగంధ్రా కార్యక్రమం
-జేసీ చిన్న రాముడు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం జిల్లా స్థాయి లో యోగా సాధన కార్యక్రమం రాజమహేంద్రవరం,ఆర్ట్స్ కళాశాల సమీపంలో, గ్రాంట్ ట్రంక్ రోడ్డు వద్ద శుక్రవారం ఉదయం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, నిత్య యోగా సాధన అనేది స్వీయ నియంత్రణ , క్రమశిక్షణతో కూడిన జీవన విధానం పై ప్రభావాన్ని సూచిస్తుందన్నారు. అభ్యాసకుడు ప్రతిరోజూ ఆసనం, ప్రాణాయామం, ధ్యానం మరియు జపించడం వంటి సాధనాలను నిత్యం సాధన చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
యోగా యొక్క ప్రధాన సూత్రం మనస్సు, శరీరం మరియు హృదయాన్ని ఏకం చేయడంలో మరియు ఈ సమతుల్యత మరియు ఐక్యత ద్వారా మీలో సామరస్యాన్ని సృష్టించడంలో ఉందనీ జేసి చిన్న రాముడు తెలియ చేశారు.క్రమం తప్పకుండా సాధన చేయడం అనేది సామరస్యాన్ని సృష్టించే అలవాటుగా మారాలన్నారు. మీరు ప్రతిరోజూ మీ ఉన్నత స్వభావాన్ని కలవడానికి కట్టుబడి ఉన్నప్పుడు, మీ నిర్ణయాలు మరియు మీ జీవితం అసలైనవిగా మారుతాయన్నారు.
కడియపులంక సత్యదేవ నర్సరీ నందు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రెండోవ జిల్లా స్థాయి యోగా సాధన కార్యక్రమం చేపట్టడం జరుగుతోందన్నారు. ఇందులో భాగస్వామ్యం అయ్యే వారి కోసం ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఆయుష్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 5.30 గంటలకు బస్సు సౌకర్యం కల్పించినట్లు జేసి తెలిపారు.
బ్రహ్మ సమ్మాజీ కుమారి మాట్లాడుతూ మార్పును అనుభవించడానికి సమయం పడుతుంది. యోగ తత్వశాస్త్రం ప్రకారం, 40 రోజులు అంటే కొత్త అలవాటును పెంపొందించుకోవడానికి మరియు క్రియ యొక్క ప్రభావాలను నిజంగా అంతర్గతీకరించడానికి పట్టే సమయం. తొలుత యోగ సాధన భంగిమలను యోగ సాధకులకు క్రమ పద్ధతిలో చేయు విధంగా తగు సూచనలను ఇస్తూ యోగ సాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో యోగాంధ్ర జిల్లా సమన్వయ కర్త అధికారి పి. కాజియా, జిల్లా ఆయుష్ ఆయుర్వేద అధికారి డా. కె సీహెచ్ రమేష్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు , జిల్లా అధికారులు, సిబ్బంది , స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు, బ్రాహ్మ కుమారి లు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News