Breaking News

న‌వోద‌యంతో నాటుసారా ర‌హిత జిల్లా ల‌క్ష్యం

-నాటుసారాను స‌మాజం నుంచి దూరం చేయడంలో సమిష్టి భాగస్వామ్యం అవసరం…
-నవోద‌యం 2.0 ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు…. జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాను నాటుసారా ర‌హితంగా తీర్చిదిద్దేందుకు స‌మ‌ష్టి భాగ‌స్వామ్యంతో న‌వోద‌యం 2.0 కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌డం జ‌రిగింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. తిరువూరు మండలం వేమిరెడ్డిపల్లి తండాలో శుక్రవారం జిల్లా ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన న‌వోద‌యం 2.0 కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో ‌మొదటి ద‌శ న‌వోద‌యం సత్ఫలితాలు ఇచ్చింద‌ని, ఇదే స్ఫూర్తితో పూర్తి నిర్మూల‌న ల‌క్ష్యంగా న‌వోద‌యం 2.0ను ప్రారంభించిన‌ట్లు వివ‌రించారు. గుర్తించిన ప్ర‌తి గ్రామంలోనూ, మండ‌లంలోనూ ప్ర‌త్యేక క‌మిటీలు ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాస్థాయి క‌మిటీ కూడా సేవ‌లందిస్తుంద‌న్నారు. క‌మిటీల ఆధ్వ‌ర్యంలో విస్తృత అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. నాటుసారా వ్యాపారం చేసే వారిపై చ‌ట్ట‌ప‌ర చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. జీవ‌నోపాధి కోసం నాటుసారా కాస్తున్న వారిని గుర్తించి.. వారికి అవ‌గాహ‌న క‌ల్పించి, ప్ర‌త్యామ్నాయ ఉపాధి అవ‌కాశాలు దిశ‌గా న‌డిపించ‌డం జ‌రుగుతుంద‌ని, ప్రభుత్వ సంక్షేమ ప‌థ‌కాల ద్వారా చేయూతనందించ‌నున్న‌ట్లు తెలిపారు. నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌తో వారిని ప్ర‌ధాన స్ర‌వంతిలోకి తీసుకువస్తామన్నారు. జిల్లాలో ఎ.కొండూరు, విస‌న్న‌పేట‌, గంప‌ల‌గూడెం, రెడ్డిగూడెం మండ‌లాల ప‌రిధిలో 26 గ్రామాల‌ను గుర్తించి క‌మిటీల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు.

జిల్లాలో ఎక్క‌డా నాటుసారాను త‌యారు చేయ‌డం లేదా విక్ర‌యించే కార్య‌క‌లాపాలు లేకుండా ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్‌, రెవెన్యూ, పోలీస్‌, పంచాయ‌తీరాజ్ శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో కృషిచేస్తున్న‌ట్లు అన్నారు. శాశ్వ‌త అంధ‌త్వం,కిడ్నీ వ్యాధులకు నాటుసారా కార‌ణ‌మ‌ని ఈ నేప‌థ్యంలో ఎక్క‌డా నాటుసారా ఆన‌వాళ్లు క‌న‌ప‌డ‌కుండా అంద‌రూ స‌మ‌ష్టిగా కృషిచేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌ ని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. కార్య‌క్ర‌మంలో తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ సూపరిండెంట్ ఎస్‌.శ్రీనివాస‌రావు, గ్రామ సర్పంచ్ పంతంగి విజయ కుమారి, వివిధ శాఖ‌ల అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *