-జిల్లాలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజా ప్రతినిధులు,విద్యార్థినీ విద్యార్థులు, యువత స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొని యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
-జూన్ 14న (నేడు) జిల్లాలోని అన్ని గ్రామాలలో, మండలాలలో, మున్సిపాలిటీలలో, జిల్లా ప్రధాన కేంద్రంలో నిర్వహించే యోగాంధ్ర ర్యాలీ, కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యంతో నిర్వహించండి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థినీ విద్యార్థులు, యువత,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొనాలని, జూన్ 14న (నేడు) జిల్లాలోని అన్ని గ్రామాలలో, మండలాలలో,మున్సిపాలిటీలలో, జిల్లా ప్రధాన కేంద్రంలో నిర్వహించే యోగాంధ్ర ర్యాలీ, యోగా కార్యక్రమాలలో పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు.
యోగాంధ్ర 2025 క్యాంపెయిన్ ను పెద్ద ఎత్తున ప్రజలు ప్రజా ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు తదితర వారిని భాగస్వాములను చేసి విజయవంతం చేయాలని ప్రతి కుటుంబంలో యోగ ఒక భాగం కావాలని ఆ దిశలో అధికార యంత్రాంగం కృషి చేయాలని, జిల్లా కలెక్టర్ గారు అందరు జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోలు తాసిల్దారులు తదితర అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పలు యోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈనెల 14న జిల్లాలోని అన్ని గ్రామాలలో మండలాలలో డివిజన్లో మున్సిపాలిటీలలో జిల్లా ప్రధాన కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీలు, యోగ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అలాగే ఈనెల 17న శ్రీకాళహస్తి 18న తిరుపతి నందు 5,000 మందితో కార్యక్రమం 19 తేదీన సూళ్లూరుపేట నియోజకవర్గ బీవీ పాలెం నందు యోగాంధ్ర క్యాంపెయిన్ కార్యక్రమాల నిర్వహణ ఉంటుందని అలాగే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి విద్యార్థిని విద్యార్థులకు యోగా పై పలు పోటీలను నిర్వహించాలని సూచించారు. యోగాంధ్ర కార్యక్రమాల సమన్వయం జిల్లా పంచాయతీ అధికారిని సుశీల దేవి చేయాలని సూచించారు. డి ఎల్ డి వో లు వారి పరిధిలోని ఎంపీడీవోలు బాధ్యతగా కార్యక్రమంలో అంకితభావంతో భాగస్వాములు అయ్యేలా, పక్కాగా కార్యక్రమాల నిర్వహణ జరిగేలా వారికి సూచనలు ఇస్తూ, పర్యవేక్షించాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్లు వారి పరిధిలో యోగాంధ్ర కార్యక్రమాలు చక్కగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో యోగా కార్యక్రమాల నిర్వహణ నిర్వహించే వెెన్యూలు ఇన్చార్జి అధికారుల వివరాలను సత్వరమే అప్డేట్ చేయాలని తెలిపారు. యోగ కార్యక్రమాల ఫోటోలు వీడియోలు హెచ్డి క్వాలిటీ ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. యోగ కార్యక్రమంలో పాల్గొనే వారికి క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి దాని ద్వారా వెన్యూ నందు పాల్గొనవచ్చు అని అన్నారు.
ర్యాలీ నిర్వహణలో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ సమన్వయం చేసుకోవాలని అన్నారు. జిల్లా అధికారులు వారి కార్యాలయ సిబ్బంది అందరిని యోగ రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు. రేపు నిర్వహించే యోగ కార్యక్రమాల ప్రాంతాలలో పబ్లిక్ అడ్రస్ సిస్టం, బ్యానర్, క్వాలిటీ జియో ట్యాగ్ ఫోటోలు, వీడియో రికార్డింగ్ ఏర్పాట్లు ఉండాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు, రేపటి కార్యక్రమం నిర్వహణ, జూన్ 21వ తేదీన నిర్వహించే కార్యక్రమానికి రిహార్సల్ అని తెలిపారు జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు ప్రదేశాలకు సంబంధించి సుమారు 6వేలు యోగా నిర్వహణ వెన్యూస్ ఉన్నాయని అన్నారు.
యోగా పై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా వారి జీవితంలో ఒక భాగంగా యోగా ఉండేలా వారిని మోటివేట్ చేయాలని అన్నారు. జిల్లాలో యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.
Prajavartha Online Telugu News