రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా లలో ఉపాధీ హామీ పధకం ద్వారా సన్న చిన్నకారు రైతుల పొలములలో పండ్ల తోటల పెంపకం చేపట్టుటకు 2025-26 ఆర్ధిక సంవత్సరంలో 2100 ఎకరములు లక్ష్యంగా నిర్ణయిచడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ద్వారా పండ్ల తోటల పెంపకం చేపట్టుటకు జిల్లాలోని అర్హులైన సన్న / చిన్న కారు రైతుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. గత ఆర్ధిక సంవత్సరం 2024-2025 లో 500 ఎకరములు లక్ష్మ్యంగా నిర్ణయయించగా , లక్ష్యాలను మించి రైతులకు 643 ఎకరములలో పండ్ల తోటల పెంపక చేపట్టడమైనదన్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో..పండ్ల తోటల పెంపకం లో మామిడి, జీడిమామిడి, ఆయిల్ పాం, డ్రాగన్ ఫ్రూట్, నిమ్మ, బత్తాయి, కొబ్బరి, సపోటా, సీతాఫలం, కోకో వంటి తదితర 26 రకాల పండ్ల తోటల పెంపకం నకు అనుమతించడం జరిగిందన్నారు. మూడు సంవత్సరముల నిర్వహణ ఖర్చుతో రైతులకు ఉచితంగా చెల్లించనున్నట్లు తెలిపారు. రైతులకు కల్పించే లబ్ది కింద వివిధ రూపములలో లబ్దిదారునకు పండ్ల రకములను బట్టి ఒక ఎకరానికి 3 సంవత్సరాలకు రూ.68,103/- నుండి రూ .2,51,226/- వరకు లబ్ది చేకూరే అవకాశం ఉందని తెలిపారు. జూన్ 25 వ తేది లోపు రైతులు తమ దరఖాస్తులను ఆ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్/ గ్రామ పంచాయితీ కార్యదర్శి లేదా మండల పరిషత్ కార్యాలయము నందు అందజేయలన్నారు.
అర్హులైన లబ్దిదారులు అందరు దరఖాస్తు చేసుకొని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకమును ద్వారా చేపట్టుతున్న పండ్ల తోటల పెంపకం పని ని రైతులు సద్వినియోగం చేసుకోనవలసినదిగా డ్వామా పిడి ఎమ్ నాగమల్లేశ్వర రావు తెలియ చేశారు.
Prajavartha Online Telugu News