Breaking News

చంద్రబాబు కృషి వలన రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బీసీ కార్పొరేషన్ ద్వారా పథకాలు,పెన్షన్లు,బీసీ కార్పొరేషన్ లోన్స్,ఆదరణ పథకం2 పథకం ద్వారా కులవృత్తులు చేసుకునే బీసీలకు సబ్సిడీతో కూడిన లోన్లు అందిస్తామని అన్నారు. విజయవాడ గొల్లపూడి బీసీ భవన్ గవర కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర బీసీ కమిషన్ ఈడి ఉమాదేవి, ఆఫీసర్ రఘు, రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర ఆధ్వర్యంలో బోర్డు డైరెక్టర్లతో మీటింగ్ నిర్వహించడం జరిగింది. సమావేశం ముందుగా అహ్మదాబాద్ విమాన ప్రయాణ మృతులకు నివాళులు అర్పిస్తూ మృతులకుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
అనంతరం విలేకరుల సమావేశంలో చైర్మన్ మళ్ళ సురేంద్ర మాట్లాడుతూ అనకాపల్లి నగరంలో గవర జాతీయులు ఎక్కువ ఉన్న ప్రాంతంలో గౌరీ కళ్యాణ మండపం నిర్మించాల్సిందిగా అధికారులు ను కోరామని, బీసీ కార్పొరేషన్ ద్వారా పథకాలు, పెన్షన్లు, బీసీ కార్పొరేషన్ రుణాలు, ఆదరణ 2, వీలైనంత తొందరగా లబ్ధిదారులను ఎంపిక చేసి త్వరితగతిన రుణాలు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరామన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎన్నికల ముందు వాగ్దానం లో భాగంగా మొదటి నెల నుండి పెన్షన్ సూర్యోదయం అవ్వక ముందే సచివాలయం ఉద్యోగస్తులతో, కూటమి పార్టీ నాయకులతో నేరుగా ఇంటికెళ్లి ప్రజలకు అందజేస్తున్నారని రాష్ట్ర మొత్తంలో అన్ని నియోజకవర్గలలో పాడైపోయిన రోడ్లన్నీ కొత్తగా నిర్మిస్తున్నారని వైసిపి ప్రభుత్వంలో మూసివేసిన అన్నా క్యాంటీన్ లను రాష్ట్రవ్యాప్తంగా తెరిచి పేదవాళ్లకు కడుపు నింపడానికి అన్న క్యాంటీన్లను పునరుద్ధరించామని, రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులను ఆదుకునేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
దీపం పథకం 2 కింద ఆంధ్రప్రదేశ్లో అర్హులైన వారందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేయడం జరిగిందని,ఆగస్టు నెల నుండి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, ఇప్పుడు తల్లికి వందనం పేరుతో ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న అర్హులైన ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులు అందరి అకౌంట్లో పదిహేను వేల రూపాయలు అందజేస్తున్నామన్నారు. ఇచ్చిన వాగ్దానాలు అమలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందన్నారు.
గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదని, కూటమి ప్రభుత్వం ఏడాదిలో చెప్పిన విధంగా అమరావతి పనులు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా పునఃప్రారంభం చేపించి నిర్మాణపనులను వేగవంతంగా చేస్తుందన్నారు. దిగ్గజ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయని మరెన్నో పరిశ్రమలు రావడానికి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయని చంద్రబాబు కృషి వలన రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది అన్నారు.
విద్యాశాఖ మంత్రివ నారా లోకేష్ విద్య వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొవస్తున్నారని, టెన్త్ క్లాసులో, ఇంటర్మీడియట్ లో ప్రతిభ చూపించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ పేరుతో అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్లు వేగి పరమేష్, పొలమరశెట్టి నాగేశ్వరరావు, భీమరశెట్టి శ్రీనివాసరావు, బొడ్డేడ శ్రీనివాసరావు, మళ్ళ గణేష్, ఆళ్ల మంగరాజు, విల్లూరి హరి, మళ్ళ రవికుమార్, బొడ్డేడ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *