గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో మునిసిపల్ ట్యాప్ కనెక్షన్ల మంజూరులో నగరపాలక సంస్థ ఆదాయానికి గండి పడేలా వ్యవహరించిన ఏఈలు పి.వెంకటేశ్వరరావు, కె.సాంబశివరావులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ ఆదాయానికి నష్టం కల్గించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిబందనల మేరకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేని కమర్షియల్ లేదా బహుళ అంతస్తు భవనాలు, నివాస గృహాలకు సాదారణ ఫీజులకు 3 రెట్లు డొనేషన్, నీటి చార్జీలను విధిస్తూ, మీటర్ ఏర్పాటు చేయాల్సి ఉండగా, పై నిర్దేశిత నిబందనలు పాటించకుండా ఏఈలు పి.వెంకటేశ్వరరావు, కె.సాంబశివరావులు ట్యాప్ కనెక్షన్ల కోసం తమ లాగిన్ ల ద్వారా తుది మంజూరు కోసం ఫైల్ పంపారన్నారు. నగరపాలక సంస్థకు ఆర్ధిక నష్టం కల్గించేలా వ్యవహరించిన ఏఈలకు 3 రోజుల్లో సమాధానం ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేశామని, వారు ఇచ్చే సమాధానం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో వార్డ్ ఎమినిటి కార్యదర్శులు కూడా నిబందనల మేరకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్న వాటికే ట్యాప్ మంజూరు దరఖాస్తు చేయాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Tags guntur
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News