Breaking News

ఈ ఏడాదిలో ర‌క్త‌హీన‌త త‌గ్గించాల‌న్న‌దే ల‌క్ష్యం

-ర‌క్త‌హీన‌త‌పై రాష్ట్ర‌స్థాయి శిక్ష‌ణ‌

మంగ‌ళ‌గిరి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఈ ఏడాది ర‌క్త‌హీన‌త‌ను(ఎనీమియా) తగ్గించాల‌న్న ల‌క్ష్యంతో సంబంధిత శాఖ‌ల అధికారుల‌తో కేంద్ర‌ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌పై రాష్ట్ర స్థాయి శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించామ‌ని ఎనీమియా ముక్త్ భార‌త్ రాష్ట్ర నోడ‌లాఫీస‌ర్ డాక్ట‌ర్ ఎల్‌బియ‌స్‌హెచ్ దేవి అన్నారు. ఎనీమియా ముక్త్ భార‌త్ కార్య‌క్ర‌మంలో భాగంగా మంగ‌ళ‌గిరిలోని హాయ్ ల్యాండ్లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్ర‌వారం నాడు నిర్వ‌హించిన శిక్ష‌కుల‌కు శిక్ష‌ణా కార్య‌క్ర‌మం(ToT)లో ఆమె మాట్టాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి వైద్యారోగ్య‌, మ‌హిళా శిశు సంక్షేమం, విద్యాశాఖల‌కు చెందిన అధికారులు, జిల్లా ఇమ్మునైజేష‌న్ అధికారులు, డిపిహెచ్ ఎన్వోలు, ఆర్బీయ‌స్కే పీఓలు దాదాపు 150 మంది హాజ‌ర‌య్యారు. వీరినుద్దేశించి ఆమె మాట్లాడుతూ సంబంధిత శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి ఎనీమియా నివార‌ణ‌కు కృషి చేయాల‌న్నారు. రాష్ట్ర స్థాయిలో శిక్ష‌ణ తీసుకున్న వారు వారివారి జిల్లాల్లో కింది స్థాయి వారికి శిక్ష‌ణ ఇవ్వాల‌న్నారు. రాష్ట్ర స్థాయిలో శిక్ష‌ణ పొందిన వారు నేర్చుకున్న విష‌యాల‌న్నీ కింది స్థాయి వారికి వివ‌రంగా చెప్పి అవ‌గాహ‌న క‌లిగించాల‌న్నారు. ఎనీమియా గుర్తించ‌డానికి క్షేత్ర‌స్థాయిలో స్క్రీనింగ్‌ను పూర్తి చేసి స‌త్వ‌రం చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ‌కు స‌హ‌క‌రించాల‌ని ఆమె కోరారు. ర‌క్త హీన‌త ఉన్న 5-9 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న వారు రోజూ ఒక మాత్ర చొప్పున రెండు నెల‌ల‌పాటు, అలాగే కౌమార ద‌శ‌లో (10-19 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న వారు) వారు రోజుకొక మాత్ర చొప్పున మూడు నెల‌ల పాటు క‌చ్చితంగా వాడాల‌న్నారు. ర‌క్త‌హీన‌త లేని 5-9 మ‌రియు, 10-19 వ‌య‌సు వారు వారానికొక మాత్ర త‌ప్ప‌నిస‌రిగా ఐర‌న్ మాత్ర వేసుకోవాలి. సంబంధిత ఎఎన్ఎం హిమోగ్లోబిన్ స్థాయిని ప‌రీక్షించాల‌న్నారు. స్కూళ్ల‌లో ఐర‌న్ మాత్ర‌లు ప్ర‌తి నెలా 50 శాతం పంపిణీ జ‌రిగిన వెంట‌నే ఇండెంట్ పెడితే మిగ‌తా 50 శాతం పంపిణీ చేయ‌డానికి ముందే పంపించే ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు. ముఖ్యంగా గ్రామీణ‌, గిరిజ‌న ప్రాంతాల్లో ర‌క్త‌హీన‌త బాధితుల‌కు చికిత్స అందించే విష‌యంలో ఏమాత్రం అల‌స‌త్వం జ‌ర‌క్కుండా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

ర‌క్త‌హీన‌త లేక‌పోయినా గ‌ర్భిణిలు రోజుకో ఐర‌న్ మాత్ర‌ను 180 రోజులు త‌ప్ప‌కుండా వాడాల‌ని, ర‌క్త‌హీన‌త ఉన్న‌వారు రోజుకు రెండు మాత్ర‌లు వేసుకోవాల‌ని, హిమోగ్లోబిన్ ప‌రీక్ష‌ను ప్ర‌తి నెలా ఎఎన్ ఎం చేస్తార‌న్నారు.మ‌ధ్య‌స్త‌, తీవ్ర ర‌క్త‌హీన‌త ఉన్న‌వారికి ఐర‌స్ సుక్రోజ్ ఇంజ‌క్ష‌న్లు ఇస్తార‌నీ, అవ‌స‌రాన్ని బ‌ట్టి బ్ల‌డ్ ట్రాన్స్‌ఫ్యూజ‌న్ కూడా చేస్తార‌ని, ఈ కార్య‌క్ర‌మాల‌న్నీ అమ‌ల‌య్యేలా డిఐఓలు, డిపిహెచ్ఎన్ ఓలు సంబంధిత శాఖ‌ల అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు. ర‌క్త హీన‌త లేని 20 నుండి 49 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న మ‌హిళ‌లంద‌రూ త‌ప్ప‌ని స‌రిగా వారానికొక ఐర‌న్ మాత్ర వేసుకునేలా అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. టెస్ట్‌, ట్రీట్మెంట్, టాక్‌(టి3) పై పెద్ద ఎత్తున ప్ర‌చారంచేసి అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని డాక్ట‌ర్ దేవి తెలిపారు. రాష్ట్రంలోని గిరిజ‌న ప్రాంతాల్లో ర‌క్త‌హాన‌త ఎక్కువ‌గా ఉంద‌ని, గిరిజ‌న సంక్షేమ శాఖ‌తో స‌మ‌న్య‌యం చేసుకుని దీన్ని నివారించేందుకు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని. మ‌లేరియా, సికిల్ సెల్ ఎనీమియా, త‌ల‌సీమియా వ్యాధుగ్ర‌స్తుల్ని గుర్తించి వెంట‌నే చికిత్స అందించే దిశ‌గా కృషి చేయాల‌ని ఆమె కోరారు. సికిల్‌సెల్ ఎనీమియా నివార‌ణకు ప్ర‌త్యేక మిష‌న్ ను కూడా కేంద్ర ప్ర‌భుత్వం ప్రారంభించింద‌న్నారు. సికిల్‌సెల్ ఎనీమియా ఉన్న‌వారిని గుర్తించి జిల్లా స్థాయి ఆసుప‌త్రుల‌కు రిఫ‌ర్ చేసి స‌రైన వైద్యం అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నాఆరు. మ‌లేరియాగా నిర్ధార‌ణైన కేసుల‌కు త‌ప్ప‌నిస‌రిగా ఎనీమియా ప‌రీక్ష కూడా చేయాల‌న్నారు. వైద్యారోగ్య శాఖ (మ‌లేరియా) డిడి డాక్ట‌ర్ రామ‌నాధ‌రావుతో పాటు ఐసిడియ‌స్‌, విద్యా, గిరిజ‌న సంక్షేమ శాఖ‌ల డీడీలు, జేడీలు ఈ కార్య‌క్రమంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *