Breaking News

హజ్ యాత్రికుల తిరుగు ప్రయాణం ప్రారంభం

-హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన 49 మంది తొలి బృందం
-ప్రభుత్వ ఏర్పాట్ల పై సంతృప్తి
-రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
హజ్ యాత్ర-2025కు బయలుదేరి వెళ్లిన యాత్రికులు తమ ఆధ్యాత్మిక యాత్రను విజయవంతంగా ముగించుకొని తిరుగు ప్రయాణాల రాక ప్రారంభమైందని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు.ఈ మేరకు శుక్రవారం అమరావతిలో ప్రకటన విడుదల చేశారు. *రాష్ట్రం నుండి బయలుదేరిన 1618 హజ్ యాత్రికులలో తొలివిడతగా శుక్రవారం (13.06.2025) 49 మంది యాత్రికులు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు సురక్షితంగా చేరుకున్నట్లు తెలిపారు.హజ్ యాత్రికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల వసతులు, సౌకర్యాలు కల్పించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు, పర్యవేక్షణ బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.హజ్ యాత్ర లో పవిత్ర మక్కా, మీనా, అరఫాత్, ముజ్ దలిఫా, మదీనా ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రాష్ట్ర హజ్ ఇన్స్పెక్టర్ లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా, హాజీలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.హజ్ యాత్రకు అన్ని విధాలుగా సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కు హైదరాబాదు కు చేరుకున్న తొలి బృందం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *