-2029లో కూడా కూటమి ప్రభుత్వానికి అధికారమే లక్ష్యంగా అందరూ పనిచేయాలి
-జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని శాశ్వతంగా తరిమికొట్టాలి
-ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కొలుసు పార్థసారథి
-పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు, ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు
గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
2029లో కూడా ఎన్డీఏ కూటమికి అధికారమే లక్ష్యంగా కూటమి కుటుంబ సభ్యులందరూ ఐకమత్యంగా ఉండి, జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని శాశ్వతంగా తరిమికొట్టాలని రాష్ట్ర గృహ నిర్మాణం మరియు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. విజయవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం మహోత్సవ కార్యక్రమం ఆదివారం సాయంత్రం గొల్లపూడిలోని ఏఎంసీలో ఆవరణలో అంగరంగ వైభవంగా జరిగింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నర్రా వాసు, మరో 15 మంది కమిటీ సభ్యులుగా అభిమానులు, ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యుల కోలాహలం మధ్య ప్రమాణస్వీకారం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ అప్పట్లో మూడు రాజధానులను ధైర్యంగా వ్యతిరేకించిన వారిలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ప్రథముడు అని అన్నారు. ఒక నియంత విధ్వంస పాలనను ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ఎంతో ధైర్యంగా ఎదిరించారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఊబిలో దింపాడని పేర్కొన్నారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ, సంపదను సృష్టిస్తూ సంక్షేమ పథకాలని అమలు చేస్తోందన్నారు.
మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాదుమాట్లాడుతూ రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చి 20 లక్షల ఉద్యోగాలను కల్పించడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. తల్లికి వందనం పథకం అమలుతో రాష్ట్ర వ్యాప్తంగా తల్లుల ఖాతాల్లో ఎంతమంది బిడ్డలు ఉంటే వారందరికీ రూ.13 వేలు చొప్పున రూ.10వేల కోట్లకు పైగా జమ చేసినట్లు పేర్కొన్నారు. దీపం-2 పథకం ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లు, 204 అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పింఛను కింద లబ్దిదారులకు ఏటా రూ.34,000 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదే నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తామన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు వెల్లడించారు. పి-4 కార్యక్రమంతో పేదరికం నుండి విముక్తి లభిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పార్థసారథి తో పాటు, మాజీ ఎంపీ కనక మేడల రవీంద్రకుమార్, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు, కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ మరియు అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ బోర్డు ఛైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాగుల్ మీరా, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు, మైలవరం జనసేన పార్టీ ఇన్చార్జి అక్కల రామ్మోహన్రావు (గాంధీ), బీజేపీ ఇంచార్జి నూతులపాటి బాలకోటేశ్వరరావు (బాల), ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
వన్ సెంటరు నుంచి ఏ.ఎం.సి వరకు భారీ ర్యాలీ
విజయవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నర్రా వాసు, కమిటీ సభ్యుల ప్రమాణస్వీకార మహోత్సవం సందర్భంగా ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు ఆదివారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు. గొల్లపూడిలో వన్ సెంటరు నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోడెడ్ల బండిపై కొనసాగిన ర్యాలీలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు, నర్రా వాసు, బొమ్మసాని సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. భారీ జనసమూహంతో పాటు ఎమ్మెల్యే కృష్ణప్రసాదు, ఏ.ఎం.సి చైర్మన్ నర్రా వాసు ప్రజలకు అభివాదం చేసుకుంటూ గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డుకు విచ్చేశారు. ప్రజలు హర్షాతిరేకాలతో ఘనస్వాగతం పలికారు. ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News