Breaking News

ప్రతి పిటీషన్ క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందించిన ప్రతి పిటీషన్ క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు.

సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ, డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి, డిఆర్ఓ ఎన్.ఎస్.కే.ఖాజావలి , ఆర్డిఓ శ్రీనివాస రావు , ఈడి ఎస్.సి కార్పొరేషన్ శ్రీనివాస్ ప్రజల నుండి 268 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన పిటీషన్లను గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలన్నారు. మరో 24 గంటల్లో 4 పిటీషన్లు గడువు ముగిసి బియాండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్ళే అవకాశం ఉన్నందున సోమవారం సాయంత్రం లోపు పరిష్కరించాలన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతగా పరిష్కరించాలన్నారు. జిల్లాలో వ్యవసాయ పనులు మొదలు అవుతున్నందున జిల్లాలో కౌలు రైతు కార్డు ( సీసీఆర్సీ ) ల టార్గెట్ ను అగ్రికల్చర్ అసిస్టెంట్లను సమన్వయం చేసుకుని సీసీఆర్సీ కార్డుల పంపిణీ చేసే లక్ష్యాన్ని పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. శాఖల వారీగా పెండింగ్ దరఖాస్తులను జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ సమీక్షించి సూచనలు చేసారు. ఫిర్యాదుల పరిష్కారాన్ని నిర్ణీత గడువు లోపు ఎట్టి పరిస్తితుల్లోను పరిష్కరించాల్సి వుందన్నారు. కోర్టు కేసులకు సంబంధించి సమీక్షిస్తూ గౌరవ కోర్టులకు ఎప్పటికప్పుడు కౌంటర్లు దాఖలు పరచాలన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా కేసు కంటెమ్ట్ వరకు వెళ్ళకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పిటీషన్ల పరిష్కారంలో సమయపాలన పాటిస్తూ నాణ్యతగా పరిష్కరించినపుడే సంతృప్తి స్థాయి పెరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో డీడీ గ్రౌండ్ వాటర్ వందనం , సిపిఓ శేషశ్రీ , ఎస్.ఈ పంచాయితీ రాజ్ బ్రహ్మయ్య , ఏ. డి హార్టికల్చర్ రవీంద్ర బాబు , జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయి , డిపిఓ బి.వి.నాగ సాయి కుమార్ , ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ విజయ్ ప్రకాశ్ , ఎల్ డి ఎం మహిపాల్ రెడ్డి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *