Breaking News

జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
యోగాంధ్రా 2025 కార్యక్రమంలో భాగంగా జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు జిల్లాలో నిర్దేశించిన ప్రాంతాల్లో యోగాసనాల కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ నిర్వహించేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పకడ్బందీ ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ కార్యాలయం సంయుక్త కలెక్టర్ ఛాంబర్ నుంచి జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ యోగాంధ్రా 2025 కార్యక్రమాల నిర్వహణపై మున్సిపల్ కమిషనర్లు , ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీన భారీ స్థాయిలో యోగాసనాలు కార్యక్రమం నిర్వహించడానికి గ్రామ , వార్డు సచివాలయాల పరిధిలో గుర్తించిన 4879 ప్రాంతాలను ముందస్తుగా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి యోగాసనాల నిర్వాహణకు అవసరమైన ఏర్పాటు చేయాలన్నారు. యోగాంద్రా కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరినీ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు మెగా యోగాసనాలు కార్యక్రమంలో పాల్గొనేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. యోగాసనాలు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్ల జనరేషన్ కార్యక్రమాన్ని రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *