Breaking News

నిర్దేశిత గడువులోగా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న అర్జీలు రీ ఓపెన్ కాకుండా, ప్రజలు సంతృప్తి చెందేలా నిర్దేశిత గడువులోగా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి అందిన 27 ఫిర్యాదులు తీసుకొని, అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందే అర్జీల్లో తక్షణం పరిష్కారం చేయగలిగినవి, కొంత సమయం తర్వాత చేయగలిగినవి వేరువేరుగా లిస్టు తయారు చేయాలన్నారు. డయల్ యువర్ కమిషనర్ కి అందిన ఆర్జీల పరిష్కారానికి విభాగాధిపతులే క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లాలన్నారు. అర్జీల పరిష్కార పురోగతిపై కమిషనర్ చాంబర్ కు ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
అనంతరం కౌన్సిల్ సమావేశ మందిరంలో పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకొని కమిషనర్ అధికారులతో మాట్లాడుతూ పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న అర్జీలను సమగ్రంగా పరిష్కారం చేయాలని, ఆయా ఆర్జీలను ర్యాండమ్ గా క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తామన్నారు. అర్జీలు బియండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లడానికి వీలులేదన్నారు. క్షేత్ర స్థాయి అధికారులు ఆర్జీలను నేరుగా వెళ్లి పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా, రోడ్ల ఆక్రమణ వంటి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు జిఎంసి కార్యాలయానికి వస్తున్నారని, అవి స్థానికంగానే పరిష్కారం చేయాలన్నారు. ప్రజల నుండి అందే అర్జీలు, ఫిర్యాదుల నమోదుకి ప్రతి విభాగంలో సూపరిండెంట్ ఆధ్వర్యంలో సిబ్బందిని కేటాయించి, ప్రత్యేకంగా రిజిస్టర్ ఏర్పాటు చేయాలన్నారు. పరిష్కారం అనంతరం ఫిర్యాదికి సమాచారం తెలియచేయాలన్నారు.
పిజిఆర్ఎస్ ద్వారా పట్టణ ప్రణాళిక విభాగం 18, ఇంజినీరింగ్ విభాగం 17, రెవెన్యూ విభాగం 2, ప్రజారోగ్య విభాగం 2, ఉపా సెల్ విభాగం 3, అకౌంట్స్ విభాగానికి సంబందించి 2 ఫిర్యాదులు మొత్తం 44 ఫిర్యాదులు అందాయన్నారు. పిజిఆర్ఎస్ లో ప్రజల నుండి అందిన ఆర్జీలను విభాగాల వారిగా విబజించి, సంబంధిత విభాగాదిపతులకి పంపి సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, బి.శ్రీనివాసరావు, సిఎంఓహెచ్ డాక్టర్ అమృతం, సిపి రాంబాబు, విఏఎస్ డాక్టర్ వెంకటేశ్వరరావు, ఈఈలు సుందర్రారామి రెడ్డి, కోటేశ్వరరావు, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *