Breaking News

ఎన్డీఏ కార్యాలయంలో ఎల్. ఓ.సీ అందజేత…

-ఎన్డీఏ కార్యాలయంలో ఎల్. ఓ.సీ అందజేసిన ఆరోగ్యశ్రీ ఈ.ఓ కే పావని, పీ.వీ.ఆర్ హాస్పిటల్ చైర్మన్ పీ. వీ. ఆర్ చౌదరి, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన ఎల్. ఓ. సీ.( లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాలను మంగళవారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో
ఆరోగ్యశ్రీ ఈ.ఓ డాక్టర్ కే పావని, పి.వి.ఆర్ హాస్పటల్స్ చైర్మన్ పీ.వి.ఆర్ చౌదరి పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి అందజేశారు. 35 వ డివిజన్ పప్పుల మిల్లు సెంటర్ ప్రాంతానికి చెందిన గంటా విజయ్(37) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనకి మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా రూ 4 లక్షల 70 వేల ఎల్.ఓ. సీ ను బాధితుడి భార్య అనూష కు అందజేశారు.
త్వరితగతిన ఎల్.ఓ. సీ మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితుడి భార్య అనూష కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్యవైశ్య మహా సభ మాజీ అధ్యక్షులు పెనుగొండ సుబ్బారాయుడు, 35 వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ సీ హనుమంతరావు, ఎన్డీఏ కూటమి నేతలు యేదుపాటి రామయ్య , బొల్లేపల్లి కోటేశ్వరరావు, రుద్రపాటి వెంకటేష్, ముదిగొండ శివ, భావిశెట్టి శ్రీనివాస్ , బ్రహ్మారెడ్డీ, దేవకి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *