Breaking News

పేదలకు అండగా కూటమి ప్రభుత్వం

-టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ , టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం పేదలకు అండగా ఉంటూ వారికి భరోసానిస్తుందని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ఎస్ బేగ్ అన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పశ్చిమ లోని లబ్ధిదారులకు మంగళవారం భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో కూటమినేతలతో కలిసి అందజేశారు.

ఈ సందర్భంగా టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా మాట్లాడుతూ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకెళుతుందన్నారు. అనారోగ్యానికి గురైన బాధితులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు పొందేలా రాజకీయాలకతీతంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎల్.ఓ.సి లను అందిస్తున్నామని తెలిపారు. 32 మంది లబ్ధిదారులకు రూ 21 లక్షల 67 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు. నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఆసరాగా నిలుస్తుందని నాగుల్ మీరా అన్నారు.

ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సామాజిక పెన్షన్లు, దీపం 2.0 పధకం కింద ప్రతి ఏట మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్కూల్ కి వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం, రైతులకు పెట్టుబడి సాయం వంటి మరెన్నో పథకాలు అందిస్తూ అభివృద్ధి ,సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అడ్డూరి శ్రీరామ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్,టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్, టీడీపీ సీనియర్ నేత కోగంటి రామారావు, ఎన్డీఏ కూటమి నేతలు మైలవరపు దుర్గారావు , గుర్రంకొండ, నాగోతి రామారావు, పోతినీడి లోకేష్,మరుపిళ్ళ రాజేష్, పీవీ చిన సుబ్బయ్య, యేదుపాటి రామయ్య , జీ బ్రహ్మారెడ్డి, మంగళపురి మహేష్, హనుమంతరావు, షేక్ తారిక్ అజీజ్, రౌతు వాసు, పల్లంటి ఆది, ప్రదీప్ రాజ్, వేవిన నాగరాజు, రుద్రపాటి వెంకటేష్, బొల్లేపల్లి కోటేశ్వరరావు, బావిశెట్టి శ్రీనివాస్, అవ్వారు బుల్లబ్బాయి, పగడాల కృష్ణ, సరిపల్లి రాధాకృష్ణ, ఒమ్మి అన్నపూర్ణ, భూదాల నంద కుమారి, నున్న కృష్ణ, సురభి బాలు, దుర్భేసుల హుస్సేన్, వేరుకొండ ఉమాకాంత్, రెడ్డిపల్లి రాజు, దొడ్ల రాజా,బెన్నాబక్తుల సోమేశ్వరరావు, దేవిన హరిప్రసాద్, దీటి ప్రభుదాస్, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *