గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నిపురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మే 21న వైజాగ్ లో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న యోగాలో దేశ ప్రధాని హాజరు కానున్న నేపధ్యంలో కార్యక్రమ విజయవంతంకు విధులు కేటాయించబడిన వివిధ శాఖల అధికారులతో మంగళవారం వైజాగ్ మెయిన్ బస్టాండ్ లోని ఈడి కార్యాలయంలో రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ పాల్గొన్నారు. తొలుత యోగా కార్యకమ వేదికని పరిశీలించి, కార్యక్రమ రాష్ట్ర నోడల్ అధికారి ఎం.టి.కృష్ణబాబు ఐఏఎస్, సిడిఎంఏ సంపత్ కుమార్ ఐఏఎస్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News