-జిల్లాలో 7 లక్షల 5 వేల మందినీ యోగా ఆంధ్రా సాధనలో భాగస్వామ్యం చేస్తున్నాం
-డి ఆర్వో టి. సీతారామ మూర్తి
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
యోగా ఆంధ్రా సాధనలో “వన్ హెల్త్ – వన్ ఎర్త్ ” అనే నినాదం తో మానవాళి ఆరోగ్యవంతమైన మార్గంలో, జీవన విధానంలో ముందుకు సాగటంలో యోగా సాధన వల్ల చేకూరే ప్రయోజనం పై అవగాహన కల్పించడం జరుగుతోందని జిల్లా రెవిన్యూ అధికారి టి సీతారామ మూర్తి పేర్కొన్నారు.
మంగళవారం స్థానిక గ్రాంట్ ట్రంక్ రహదారి, ఆర్ట్స్ కళాశాల సమీపంలో పంచాయతీ రాజ్, మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో యోగా ఆంధ్రా సాధన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 4,900 పైగా ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రదేశాల్లో 7,50,000 మంది యోగ సాధకులకు ప్రతి నిత్యం యోగా సాధన పై శిక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 21వ తేదీ శనివారం విశాఖపట్నంలో నిర్వహించు ప్రపంచ యోగా దినోత్సవం కి గౌరవనీయులు భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ , రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనే కార్యక్రమంలోభాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వామ్యం చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి ప్రతి పౌరుడు యోగ సాధనలో శిక్షణ పొంది ప్రభుత్వ లక్ష్యాలను సాధించేందుకు తమ వంతుగా సహకారం అందించాలని, ఈ వేడుకలను విజయవంతం చేయవలసినదిగా ఆయన కోరారు. ప్రతినిత్యం సాధన ద్వారా మానవ జీవన శైలి లో మార్పు రాముడు కాక మంచి అలవాట్లు వస్తాయని ఆయన అన్నారు. ప్రతినిత్యం యోగా సాధన ద్వారా మందులతో భయం కానీ ఎటువంటి రుగ్మతలు కూడా నయం చేసుకోవచ్చని ఆయన తెలియజేశారు.
జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు మాట్లాడుతూ, ప్రతినిత్యం యోగ సాధన వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి బిపి, షుగర్, థైరాయిడ్ వంటి రోగాలు శరీరానికి దరిచేరవన్నారు. బ్రహ్మకుమారి సిస్టర్స్ ద్వారా మానసిక స్థితి పై , అనుభవజ్ఞులైన యోగ సాదుకులచే యోగా కార్యక్రమాలపై శిక్షణ పొందడం ఎంతో సంతోషమని ఆయన అన్నారు. జిల్లా యంత్రాంగం తరపున జిల్లా కలెక్టర్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ వారి ఆధ్వర్యంలో ప్రతినిత్యం కార్యక్రమాలు ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలియ జేశారు. యోగా సాధన క్రమం 45 నిమిషాల నిడివి కలిగి ఉంది, ఇందులో 15 నిమిషాల యోగా భంగిమలు, 5 నిమిషాల నాడి శోధన ప్రాణాయామం, 20 నిమిషాల ధ్యానం (గైడెడ్ ధ్యానం లేదా సహజ సమాధి ధ్యానం), మళ్ళీ 5 నిమిషాల నాడి శోధన ప్రాణాయామం ఉన్నాయన్నారు. ఇదే క్రమ పద్ధతిలో ప్రతినిత్యం యోగ సాధన చేయవలసి ఉంటుందన్నారు. ఏదైనా ఒక మార్పును ఆచరణలోకి తీసుకుని రావడం లో కొంత సమయం పడుతుందన్నారు. యోగ తత్వశాస్త్రం ప్రకారం 40 రోజులు అంటే కొత్త అలవాటును పెంపొందించుకోవడానికి మరియు క్రియ యొక్క ప్రభావాలను నిజంగా అంతర్గతీకరించడానికి సమయం పడుతుందని ఆయన అన్నారు.
సాధన కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు , ఆయుష్ వైద్యులు డాక్టర్ కె.సీహెచ్. రమేష్, ఆయుష్ నోడల్ అధికారి పి. కేజియా, డా అల్లూరి రామలింగయ్య ప్రభుత్వ హోమియో కళాశాల ప్రిన్సిపల్ డా కెవివిఎస్ సత్య కుమార్, సూపరింటెండెంట్ పీవీవీఎస్ ఎన్ చౌదరీ, ఇతర శాఖల అధికారులు, వైద్యాధికారులు , బ్రహ్మ కుమారి సిస్టర్స్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆయుష్ , వైద్య ఆరోగ్య, హోమియో వైద్యులు, విద్యార్థులు , యోగా సాధకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News