Breaking News

అన్ని శారీరిక, మానసిక రుగ్మతలకు సమాధానం ఎకైక మార్గం నిత్య యోగ సాధన

-జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామమూర్తి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతినిత్యం యోగ సాధన చేయడం వల్ల అనేక శారీరక రుగ్మతలకు సంబంధించిన సరైన సమాధానం చెప్పవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి అన్నారు. బుధవారం ఉదయం ఆర్ట్స్ కళాశాల సమీపంలో గ్రాంట్ ట్రంక్ రహదారి లో రెసిడెన్షియల్, ఆయుష్ శాఖ సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా డి ఆర్వో టి సీతారామ మూర్తి మాట్లాడుతూ, ప్రతినిత్యం యోగ సాధన క్రమం తప్పకుండా చేయడం వలన మనసు ఎంతో మానసిక ఉల్లాసం కలిగి శరీరం తెలుగు అవుతుందన్నారు. తద్వారా రక్త ప్రసరణ సాఫీగా జరిగి నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుందన్నారు. ముఖ్యంగా యువతతో పాటు వయసు మీద పడిన మధ్య వయస్కులు, వృద్ధులు క్రమం తప్పకుండా యోగ సాధన చేయడం వలన మందులకు దూరంగా ఉండవచ్చు అని ఆయన తెలియజేశారు. శవాసనం శవ సాధనను తంత్రంలో అతి ముఖ్యమైన్నారు. అత్యంత కష్టమైన మరియు అత్యంత రహస్యమైన ఆచారాలలో ఒకటిగా పరిగణిస్తారు అని ఆయన అన్నారు. సాధనలో నాలుగు దశలు ఉన్నాయి బ్రహ్మ సాధన, ధ్యాన ధారణ, మంత్రోచ్ఛారణ మరియు స్తోత్రాలు, విగ్రహారాధన వంటివి ఉన్నట్లు తెలిపారు. బ్రహ్మ భావనతో ఆధ్యాత్మిక సాధన చేసినప్పుడు, ఆ ప్రకృతిబ్రహ్మ సాధన అని పిలుస్తారు, ఇది ధ్యానం యొక్క పరిపూర్ణ విధానం అంటారు. క్రమం తప్పకుండా వేకు జామున యోగ సాధనకు సిద్ధమై యోగ ప్రక్రియ పూర్తి చేసుకుంటే వత్తిడి నుంచి , బిపి వంటి శారీరక మానసిక ఒత్తిడి లకు దూరంగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. సాధన కార్యక్రమం లో  జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు ,  ఆయుష్ వైద్యులు డాక్టర్ కె.సీహెచ్. రమేష్,  ఆయుష్ నోడల్ అధికారి పి. కేజియా,  డా అల్లూరి రామలింగయ్య ప్రభుత్వ హోమియో కళాశాల ప్రిన్సిపల్ డా కెవివిఎస్ సత్య కుమార్, సూపరింటెండెంట్ పీవీవీఎస్ ఎన్ చౌదరీ, ఇతర శాఖల అధికారులు, వైద్యాధికారులు , బ్రహ్మ కుమారి సిస్టర్స్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆయుష్ , వైద్య ఆరోగ్య, హోమియో వైద్యులు, విద్యార్థులు  , యోగా సాధకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *