Breaking News

శిక్షకులతో అభాస్యకుల మ్యాపింగ్ పూర్తి చెయ్యాలి

-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
యోగా ఆంధ్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, రికార్డు స్థాయిలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లో జూన్ 21 న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా స్థాయి వేడుకల నిర్వహణ విషయంపై అధికారులకి జిల్లా కలెక్టర్ పలు సూచనలు చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా యోగా సాధన కోసం గత నెల రోజులుగా వివిధ రంగాల వారితో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో యోగా సాధన కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా యోగా సాధన ఒక కార్యక్రమం లా కాకుండా సామాజిక చైతన్యం కలిగించే ప్రక్రియగా ప్రజలను స్వచ్ఛందంగా భాగస్వామ్యం చెయ్యడం జరిగిందని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా 8,52,157 మందిని రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల, గ్రామ, సచివాలయం పరిధిలో వారి పేర్లు నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 5,637 లోకేషన్స్ గుర్తించడం జరిగిందని, వాటిలో 5554 మంది మాస్టర్ ట్రైనర్స్ తో 8,51,105 మందిని అనుసంధానం చెయ్యడం జరిగిందని తెలిపారు.

దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో పాల్గొనడం, ఆ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. మన ఆరోగ్యం మన కోసం అనే సంకల్పంతో యోగా సాధన కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు.  నగరంలోని 14 ప్రాంతాల్లో, జిల్లా వ్యాప్తంగా 5554 ప్రాంతాల్లో యోగా సాధన కార్యక్రమం నిర్వహించనున్నట్లు, దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి తో మనం అందరం కూడా అదే సమయంలో యోగా సాధన కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. ఒక రికార్డు స్థాయిలో భాగస్వామ్యం కావాలని, విద్యార్థులలో ఉత్సుకత పెంచాలని, విద్యార్థులు తదితరులు తల్లితండ్రులతో కలిసి పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలియ చేశారు.  వాడవాడాల పండుగ వాతావరణం లో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. మైక్ ల ద్వారా ప్రచారం చేయడం గ్రామ వార్డులలో, గ్రామ పంచాయతీ లలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి యోగా సాధన చేయాలన్నారు.  మేజర్ పంచాయతీ లలో స్క్రీన్స్ ఏర్పాటు చెయ్యడం, ఎక్కడికక్కడ డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి ఫోటోలు వీడియో లు తీసి వెబ్సైట్ లో అప్లోడ్ చెయ్యాలని పేర్కొన్నారు. మండల పరిధిలో తహసీల్దార్ లు, ఎంపీడీవో లు, నియోజక వర్గాల పరిథిలో ప్రత్యేక అధికారులు ఆధ్వర్యంలో వేడుక గా నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ జేసీ డి ఆర్వో టి సీతారామ మూర్తి, ఆయుష్ అధికారులు, యితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *