Breaking News

విష్ణు కార్స్ కు మరో ప్రతిష్టాత్మక గుర్తింపు

-టాప్ టాక్స్ పేయర్ మరియు అత్యుత్తమ మహిళా పారిశ్రామికవేత్త విభాగాల్లో సి.జి.ఎస్.టి. పురస్కారాలు
-రెండు విభాగాల్లో ఉత్తమంగా నిలిచిన విష్ణు గ్రూప్ ఆఫ్ కంపెనీస్

చెన్నై, నేటి పత్రిక ప్రజావార్త :
లక్షలాది కస్టమర్ల ఆదరణతో కార్ల వ్యాపారంలో నమ్మకానికి మారుపేరుగా నిలిచిన విష్ణు కార్స్ మరో ప్రతిష్టాత్మక పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంది. చెన్నై జి.ఎస్.టి. శాఖ ప్రకటించిన టాప్ టాక్స్ పేయర్, అత్యుత్తమ పారిశ్రామిక వేత్తల విభాగాల్లో రెండు పురస్కారాలకు ఏక కాలంలో ఎంపికైన సంస్థగా నిలిచింది. రెండు విభాగాల్లో ఒకే సంస్థ నిలవడం ఇదే తొలిసారి. టాప్ టాక్స్ పేయర్ గా విష్ణు కార్స్, ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్తగా విష్ణు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపా వెంకట్ ఎంపికయ్యారు. 8వ సి.జి.ఎస్.టి. దినోత్సవాన్ని పురస్కరించుకుని జి.ఎస్.టి. తమిళనాడు మరియు పుదుచ్చేరి జోన్ చెన్నైలోని కళైవర్ ఆరంగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో దీపా వెంకట్ ఈ రెండు పురస్కారాలను స్వీకరించారు.

ఈ సందర్భంగా దీపా వెంకట్ మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా నమ్మకానికి మారుపేరుగా నిలిచిన విష్ణు కార్స్ ను రెండు విభాగాల్లో సి.జి.ఎస్.టి. వారు గుర్తించడం ఆనందంగా ఉందని తెలిపారు. కస్టమర్ల ఆదరణ మరియు సంస్థలో సేవలు అందిస్తున్న ఉద్యోగుల నిబద్ధతతోనే ఇది సాధ్యమైందన్న ఆమె, ఈ పురస్కారాలను వారికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. వ్యాపార రంగంలో ఈ పురస్కారాలు తమ బాధ్యతను మరింత పెంచాయన్న ఆమె, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో CUMI మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధరన్ రంగరాజన్, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ డా. రామ్ నివాస్, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్  ఏ.ఆర్.ఎస్. కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *