Breaking News

వెలంపల్లి ని కలిసిన వైద్య విద్యార్థులు

-తమకు మద్దతు ఇవ్వాలని కోరిన వైద్య విద్యార్థులు ..
-విద్యార్థులకు అండగా ఉంటాం – వెలంపల్లి
-వైద్య విద్యార్థులు చేసేటువంటి నిరసన కార్యక్రమానికి వైకాపా తరఫున మద్దతు తెలుపుతాం – వెలంపల్లి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక బ్రాహ్మణ వీధిలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు కార్యాలయంలో బుధవారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ లో చదువుతున్నా విద్యార్థులు వెలంపల్లి శ్రీనివాస రావు ని కలిసి తమ సమస్యలు తెలిపి వినతిపత్రం ఇచ్చి గురువారం ధర్నా చౌక్ లో జరుగు నిరసన కార్యక్రమానికి విచ్చేసి తమ మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్బంగా వెలంపల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక వైద్య విద్యార్థులను మోసం చేస్తున్నారన్నారు.వైద్య విద్యార్థుల జీవితాలతో ఎన్టీఆర్ యూనివర్సిటీ రిజిస్టర్ చెలగాటమాడుతురన్నారు. వైద్య విద్య పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు వెంటనే డాక్టర్ పట్టాలను ఇవ్వాలని కోరారు. గురువారం వైద్య విద్యార్థులు చేసేటువంటి నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు తెలుపుతామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *