Breaking News

మా పి ఆర్ లు మాకు ఇవ్వండి అంటూ దీక్ష చేపట్టిన వైద్య విద్యార్థులు…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులకు పిఆర్ లు ఇవ్వాలని బుధవారం ధర్నా చౌక్ లో ఏపీ ఎఫ్ఎంజి’ఎస్ నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఒకటిన్నర సంవత్సరం నుంచి విద్యార్థులు ఏపీఎంసీ చుట్టూ తిరుగుతూ మా సమస్యను పరిష్కరించండి మా పి ఆర్ లు మాకు ఇవ్వండి అని అడుగుతున్న పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఏ రాష్ట్రంలో లేనటువంటి నిబంధనలు మన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో పెట్టి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. మరి ముఖ్యంగా విద్యార్థులే స్వయంగా వెళ్లి మా సమస్యను పరిష్కరించండి అంటూ ఎన్ఎంసి నీ కోరగా విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లను పరిశీలించి వీరికి పిఆర్లు ఇవ్వచ్చని మెయిల్ ద్వారా రిజిస్టర్ రమేష్ పంపించడం జరిగింది. ఏమాత్రం ఎన్ఎంసి చెప్పినటువంటి నిబంధనలను పాటించకుండా నా సొంత నిర్ణయాలు ఏపీఎంసీలో అమలు చేస్తాను. నన్ను ఎవరు ఆపేది అన్నట్టుగా ఇతను తీరు ఉందన్నారు. దేశమంతటా అమలు చేస్తున్న ఎన్ఎంసి రూల్స్ కానీ ఆంధ్ర రాష్ట్రానికి లేవంటున్న ఏపీఎంసీ రిజిస్టర్. ముఖ్యంగా మే 2024 బ్యాచ్ కి ఇంటెన్షిప్ ఒక్క సంవత్సరం చేయమని అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది కానీ పూర్తి అవుతున్న దశలో ఇంకా ఒక నెల ఉన్న సమయంలో ఇంకా కొంతకాలం చేయమని వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు చెప్పింది రాజ్యాంగం అన్నట్టుగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారా లేదని కూడా ఆలోచన చేయకుండా నిబంధనలు మార్చుకుంటూ పోతున్నారన్నారన్నారు. దీని వలన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆలోచన చేసి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఏ స్టేట్ లో కూడా లేనిది కేవలం ఏపి లోనే ఎందుకు జరుగుతుంది అని ఏపీఎంసి రిజిస్ట్రార్ పిల్లల మీద కక్ష సాధింపు చర్యలు కట్టిపెట్టి రిజిస్ట్రేషన్ లు చెయ్యాలి అని వాపోతున్న ఎఫ్ఎంజి ల తల్లిదండ్రులు ఫారిన్ వెళ్ళింది చదువు కోవాలి అనే ఆశ చచ్చిపోక కానీ డబ్బులు ఎక్కువ అయి కాదు ప్రతి ఒక్క స్టూడెంట్ మీద 25 లక్షల వరకు అప్పులు ఉన్నాయి అవి తీర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది అని ఇంకా రిజిస్ట్రేషన్ లు ఇవ్వకపోతే మరణం ఆ శరణం అంటున్న ఏపీ ఎఫ్ఎంజి లు. కేవలం ఏపీ లో మాత్రం ఈ వివక్ష ఎందుకు అని మనస్థాపానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.సాయికుమార్ పి డి ఎస్ యు రాష్ట్ర కార్యదర్శి ఐ.రాజేష్ తదితరులు పాల్గొని సంఘీ భావం తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *