Breaking News

రోడ్లమీద వ్యర్ధాలు వేసే ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్గించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లమీద వ్యర్ధాలు వేసే ప్రాంతాల్లో ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులు స్థానిక ప్రజలకు అవగాహన కల్గించాలని, అనంతరం కూడా రోడ్ల మీద వేస్తే అపరాధ రుసుం విధించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్ సుద్దపల్లి డొంక, పాత గుంటూరు, బాలాజీ నగర్, పొన్నూరు రోడ్, కెవిపి కాలనీ మెయిన్ రోడ్, జాతీయ రహదారి వెంబడి పలు ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల పై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య పనుల మెరుగుదలకు పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అనేక ప్రాంతాల్లో డంపింగ్ పాయింట్స్ ఉంటున్నాయన్నారు. డంపింగ్ పాయింట్స్ ఉండే ప్రాంతాల్లో ప్రజలు రోడ్ల మీద వ్యర్ధాలు వేయకూడదని, నూరు శాతం ఇంటికి ప్రజారోగ్య కార్మికులు వచ్చి తీసుకుంటారని శానిటేషన్ కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు బృందంగా వెళ్లి అవగాహన కల్గించాలన్నారు. ఆయా పాయింట్స్ దగ్గర ప్రజారోగ్య కార్మికులను కొంత కాలం కేటాయించి, ప్రజలు వ్యర్ధాలను వేయకుండా అడ్డుకోవాలన్నారు. అలాగే జాతీయ రహదారి వెంబడి కూడా కొబ్బరి బోండాలు, నిర్మాణ వ్యర్ధాలు వేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ప్రజారోగ్యానికి భంగం కల్గించేలా వ్యవహరించే వారిపై అపరాధ రుసుం విధించాలని ఆదేశించారు. అలాగే సుద్దపల్లి డొంక రోడ్ లో పేడని రోడ్ల మీద వేసేవారిని అడ్డుకోవాలన్నారు. అలాగే సచివాలయాల వారీగా ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరిగేలా మైక్రో ప్లాన్ ప్రకారం శానిటేషన్ కార్యదర్శులు భాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. కార్మికులు ఉదయం ఇంటింటి చెత్త సేకరణ, మధ్యాహ్నం డ్రైన్ల శుభ్రం చేయాలన్నారు. పర్యటనలో ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *