Breaking News

వైద్య విద్యార్థులకు తక్షణమే పీఆర్ ఇవ్వాలి…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులకు పిఆర్ లు ఇవ్వాలని గురువారం ధర్నా చౌక్ లో ఏపీ ఎఫ్ఎంజి’ఎస్ నిరసన దీక్ష కార్యక్రమం కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న తమకు పీఆర్ లు ఇవ్వాలన్నారు. విద్యార్థుల పట్ల రిజిస్ట్రార్ వ్యహరిస్తున్న తీరు పై బాధను వ్యక్తం చేశారు. విద్యార్థులే స్వయంగా వెళ్లి మా సమస్యను పరిష్కరించండి అంటూ ఎన్ఎంసి నీ కోరగా విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లను పరిశీలించి వీరికి పిఆర్లు ఇవ్వచ్చని మెయిల్ ద్వారా రిజిస్టర్ రమేష్ పంపించడం జరిగింది. ఏమాత్రం ఎన్ఎంసి చెప్పినటువంటి నిబంధనలను పాటించకుండా నా సొంత నిర్ణయాలు ఏపీఎంసీలో అమలు చేస్తాను. నన్ను ఎవరు ఆపేది అన్నట్టుగా ఇతను తీరు ఉందన్నారు. విద్యార్థుల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పదించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట గోపి, పి డి ఎస్ యు రాష్ట్ర కార్యదర్శి ఐ.రాజేష్, వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రవిచంద్ర, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సాయికుమార్, ఎస్ఎఫ్ఎ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొని సంఘీ భావం తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *