గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థలో విభాగాల వారీగా కోర్ట్ కేసుల పరిష్కారంపై విభాగాధిపతులు, సూపరిండెంట్లు ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం కౌన్సిల్ సమావేశ మందిరంలో కోర్ట్ కేసుల పురోగతి, పెండింగ్ అంశాలపై విభాగాధిపతులు, సూపరిండెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత విభాగాల వారీగా ఉన్న కేసులు, తీర్పు వచ్చిన కేసులు, పెండింగ్, కంటేమ్ట్ వివరాలు తీసుకొని, మాట్లాడుతూ వివిధ అంశాలపై ఆయా సంస్థలు, వ్యక్తులు ఫైల్ చేసిన కోర్ట్ కేసుల్లో ఎక్కువ శాతం పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించినవే అధికంగా ఉన్నాయన్నారు. విభాగాధిపతులు కోర్ట్ కేసులపై ప్రతి రోజు విభాగ సూపరిండెంట్, సంబంధిత అధికారులతో సమీక్షించుకోవాలని, కేసుల్లో నగరపాలక సంస్థ నుండి తీసుకోవాల్సిన చర్యల్లో లోపం ఉంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇక నుండి ప్రతి గురువారం కేసుల పురోగతిపై సమీక్ష చేస్తామని, రోజువారి నివేదిక ఇవ్వాలన్నారు. కేసుల్లో కౌంటర్లు, అఫిడవిట్లు, ప్యారావైజ్ రిమార్క్స్ వంటివి పూర్తీ చేయాలన్నారు. సూపరిండెంట్లు, లీగల్ సెల్ సిబ్బంది సమన్వయంతో ప్రతి రోజు కోర్ట్ కేసుల పురోగతిపై తమకు నివేదిక ఇవ్వాలన్నారు.
సమావేశంలో ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, సిటి ప్లానర్ రాంబాబు, సిఎంఓహెచ్ డాక్టర్ అమృతం, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, మేనేజర్ బాలాజీ బాష, విభాగాల సూపరిండెంట్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News