Breaking News

కూట‌మి ప్ర‌భుత్వంలో దేశంలో ఎక్క‌డా లేని సంక్షేమం రాష్ట్రంలో అమ‌లు అవుతుంది : ఎంపీ కేశినేని శివ‌నాథ్

-రెండో రోజు సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివ‌నాథ్*
-నందిగామ నియోజ‌క‌వ‌ర్గం కంచిక‌చ‌ర్ల లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం
-ఎంపీ కేశినేని శివ‌నాథ్ కు ఘ‌న స్వాగ‌తం ప‌లికిన కంచిక‌చ‌ర్ల ప్ర‌జ‌లు, టిడిపి శ్రేణులు
-మోడ‌ల్ కాల‌నీలో వాట‌ర్ ట్యాంక్ నిర్మించి ప్రారంభోత్స‌వానికి వ‌స్తాన‌ని హామీ
-రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడు ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు
-త‌ల్లికివంద‌నం ప‌థ‌కంతో విద్యార్ధుల కుటుంబాల్లో ఆనందం
-ఆగ‌స్టు 15 నుంచి మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణ సౌక‌ర్యం
-ఆగ‌స్టు 14వ తేదీ ఆటో కార్మికుల‌కు రూ.15 వేలు
-కార్మిక వ‌ర్గం ఇబ్బంది ప‌డ‌కుండా వుండాల‌నేది సీఎం చంద్ర‌బాబు ధ్యేయం

కంచిక‌చ‌ర్ల‌, నేటి పత్రిక ప్రజావార్త :
వైసిపి పాల‌న‌లో అథోగ‌తి పాలైన రాష్ట్రాన్ని కూట‌మి ప్ర‌భుత్వంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఏడాది కాలంలోనే రాష్ట్రాన్ని ప్ర‌గ‌తి బాట ప‌ట్టించారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ ప‌థ‌కాల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాష్ట్రంలో అమలు చేస్తున్నార‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు.

రెండ‌వ రోజు సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు కార్య‌క్ర‌మాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ నందిగామ నియోజ‌క‌వ‌ర్గం, కంచిక‌చ‌ర్ల మోడ‌ల్ కాల‌నీలో గురువారం నిర్వహించారు. నందిగామ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిశీల‌కులు బ‌చ్చుల సుబ్ర‌హ్మ‌ణ్య బోస్, టిడిపి కంచిక‌చ‌ర్ల మండ‌ల పార్టీ అధ్య‌క్షుడు కోగంటి బాబు, టిడిపి కంచిక‌చ‌ర్ల పట్ట‌ణ అధ్యక్షుడు వేమా వెంక‌ట‌రావు నందిగామ టౌన్ పార్టీ అధ్య‌క్షుడు ఏచూరి రాముల‌తో క‌లిసి ఇంటింటికి వెళ్లి ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం ఏడాదిగా చేప‌ట్టిన సంక్షేమ‌, అభివృద్ది ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు.

ప్ర‌జ‌ల‌కు అందుతున్న సంక్షేమ ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ప్ర‌తి కుటుంబం ఎంపీ కేశినేని శివ‌నాథ్ కి కూట‌మి ప్ర‌భుత్వం అందిస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌పై వారి ఆనందం వ్య‌క్తం చేశారు. మోడ‌ల్ కాల‌నీలో వాట‌ర్ ట్యాంక్ లేక తాగునీటి కోసం ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బంది ఎంపీ కేశినేని శివ‌నాథ్ దృష్టికి రాగా..త్వ‌ర‌లో వాట‌ర్ ట్యాంక్ నిర్మించి ప్రారంభోత్స‌వం చేయ‌టానికి వ‌స్తాన‌ని కాల‌నీ వాసుల‌కు భ‌రోసా ఇచ్చారు.

ఈ సంద‌ర్బంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ ప్రజల సంతృప్తే ముఖ్యంగా ముందుకు సాగుతున్న కూట‌మి ప్ర‌భుత్వ‌ సంక్షేమ‌, అభివృద్ది ప‌థ‌కాల వల్ల రాష్ట్రంలో ప్ర‌తి కుటుంబం ఆనందంగా వుంద‌న్నారు. గ‌త ఏడాది కాలంగా ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం, ఎన్నో సంక్షేమ‌, అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు. ఈ సంక్షేమ అభివృద్ది కార్య‌క్ర‌మాలు ప్ర‌జ‌లంద‌రికీ అందుతున్నాయా లేదా, సంక్షేమ ప‌థ‌కాల అమ‌ల్లో ఏమైనా ఇబ్బందులు, స‌మ‌స్య‌లు వున్నాయా అనే విష‌యాలు స్వ‌యంగా ప‌రిశీలించి, ఆ స‌మ‌స్య‌ల‌ను అక్క‌డిక్క‌డే ప‌రిష్క‌రించే విధంగా
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు ఇంటింటికి కార్య‌క్ర‌మం రూపొందించారని తెలిపారు.

మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా అధికారంలోకి రాగానే రూ.3 వేలుగా పెన్ష‌న్ ను వెయ్యి రూపాయ‌లు పెంచి నాలుగు వేలు అందిస్తున్నామ‌ని…దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పెన్ష‌న్ అందిస్తున్నార‌ని తెలిపారు. ఎన్టీఆర్ భ‌రోసా కింద దివ్యాంగులకు పెన్ష‌న్ రూ.6 వేలు, పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేలు అందిస్తూ వారి క‌ళ్ల‌లో సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆనందం నింపుతున్నార‌న్నారు.

గ‌త ప్ర‌భుత్వం పేద‌ల‌కు రూ.5ల‌కు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు మూసివేస్తే…సీఎం చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోపే రాష్ట్రంలో 204 అన్న క్యాంటీన్లు పున‌రుద్ధ‌రించిన‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు సీఎం చంద్ర‌బాబు కృషి చేస్తున్నాడ‌న్నారు.

అలాగే మ‌హిళ‌ల‌కు ఏడాదికి 3 గ్యాస్ సిలిండ‌ర్లు ఉచితంగా అందిస్తుండ‌టంతో మ‌హిళ‌ల‌కు ఆర్థికంగా కొంత వెసులు బాటు క‌లిగింద‌న్నారు.. త‌ల్లికివందనం ప‌థ‌కం కింద ఇంట్లో ఎంత మంది చ‌దువుకుంటే అంత‌మందికి ప‌దిహేను వేల రూపాయ‌లు ఇవ్వ‌టం జరిగింద‌న్నారు. పాఠ‌శాల‌లు తెరిచే స‌మ‌యానికి త‌ల్లికి వంద‌నం కింద ఇంట్లో ఎంత మంది విద్యార్ధులు వుంటే అంత మందికి పదిహేను వేల రూపాయ‌ల చొప్పున‌ ఇవ్వ‌టంతో విద్యార్ధుల త‌ల్లిదండ్రులు ఆనందంగా వున్నార‌ని తెలిపారు.

రాష్ట్రం లోటు బ‌డ్జెట్ లో వున్నసంక్షేమం, అభివృద్ది విష‌యంలో ఎక్క‌డ రాజీ ప‌డ‌కుండా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఒక‌టో తారీఖు జీతాలు ఇవ్వ‌టంతోపాటు, సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు త‌ర్వ‌గా అమ‌లు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఆగ‌స్టు 15వ తేదీ నుంచి మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం అమ‌లు చేయ‌బోతున్నార‌ని, ఇందువ‌ల్ల ఆటో డ్రైవ‌ర్ల ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా వుండేందుకు ఆగ‌స్టు 14వ తేదీ ప‌దిహేను వేల రూపాయాలు ఆటో డ్రైవ‌ర్ల‌కు అందించ‌నున్న‌ట్లు తెలిపారు. అలాగే నిరుద్యోగ భృతి కూడా నిరుద్యోగులకు అందించేందుకు డేటా సేక‌రణ పూర్తి అయింద‌ని, మ‌రో మూడు నెల‌ల్లో నిరుద్యోగ భృతి అందించ‌టానికి ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసిన‌ట్లు వెల్ల‌డించారు. పీ 4 లింక్ ద్వారా ప్ర‌తి నెల మ‌హిళ‌ల‌కు ప్ర‌తినెల రూ.1500 భృతి ఇచ్చేందుకు కూట‌మి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. రైతు సంక్షేమం కోసం ఈ నెలాఖ‌రులో అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కం రైతుల‌కు రూ.20 వేలు అందించ‌నున్న‌ట్లు తెలిపారు.

అలాగే రైతుల ద‌గ్గ‌ర కొనుగోలు చేసిన ధాన్యం కు 24 గంట‌ల్లో డ‌బ్బులు బ్యాంక్ ఖాతాలో జ‌మ చేసిన ఘ‌న‌త ఎన్డీయే కూట‌మి సొంతమ‌న్నారు. ఇక మామిడి రైతులు, మిర్చి రైతులు, గిట్టుబాట ధ‌ర క‌ల్పించటంతోపాటు, టుబాకో రైతుల నుంచి పోగాకు ప్ర‌భుత్వమే కొనుగోలు చేసి గొడౌన్ల‌లో పెట్టుకోవ‌టం జ‌రిగిందన్నారు. డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ లో కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌జా సంక్షేమం కోసం ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టార‌న్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ఇప్ప‌టికే ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న కోసం ఆరు ల‌క్ష‌ల కోట్లు రూపాయాల పెట్టుబ‌డులు వైజాగ్ కి రావ‌టం జ‌రిగింద‌న్నారు. ప్ర‌భుత్వ విప్ , ఎమ్మెల్యే సౌమ్య అమెరికా నుంచి రాగానే సుప‌రిపాల‌న తొలి అడుగు కార్య‌క్ర‌మంలో పాల్గొంటార‌ని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర బిసి సెల్ అధికార ప్ర‌తినిధి య‌న‌గాల నూకాల‌మ్మ‌, పెండ్యాల గ్రామ‌ సర్పంచ్ షబ్బీర్ , పెరికలపాడు గ్రామ‌ సర్పంచ్ మన్నే సాత్విక , టిడిపి సీనియర్ నాయకులు గుత్తా రత్నం, నన్నపనేని లక్ష్మీనారాయణ , నన్నపనేని నరసింహారావు, కొఠారు సత్యనారాయణ ప్రసాద్ , జనసేన మండల పార్టీ అధ్యక్షుడు నాయుని సతీష్ , జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ , టి.ఎన్.ఎస్.ఎఫ్. జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పి.చ‌ర‌ణ్ సాయి యాద‌వ్, జిల్లా ఐ.టి.డి.పి అధ్యక్షుడు చిరుమామిళ్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు…

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *